
Salman Khan: దక్షిణాది సినిమాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రం తెలుగు సినిమా స్థాయిని, ఆమాటకొస్తే ఇండియన్ సినిమా స్థాయిని ఓ మెట్టు ఎక్కించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలితో మొదలైన ఈ పరంపర పుష్పతో (Pushpa) మరింత ముందుకెళ్లింది. ఈ సినిమాకు బీటౌన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతేకాకుండా తెలుగులో విజయాన్ని సాధించిన కొన్ని సినిమాలు హిందీలో రీమేక్ అయి భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇలా తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసి విజయాన్ని అందుకున్న వారిలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకరు. ఆయనకు దక్షిణాది సినిమాలపై ఉన్న ఇష్టాన్ని అడపాదడపా ప్రకటిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి సౌత్ సినిమాపై ప్రశంసలు కురిపించారు సల్మాన్.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఇటీవలే ఓ షెడ్యూల్ పాల్గొన్నారు కూడా. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్లూ భాయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సౌత్ సినిమాలు హిందీలో అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. కానీ హిందీ చిత్రాలు మాత్రం దక్షిణాది ప్రేక్షకుల్ని ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నాయో అర్థం కావడం లేదు. ముఖ్యంగా దక్షిణాది చిత్రాల్లో హీరోయిజాన్ని బాగా చూపిస్తారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ బాలీవుడ్ సినిమాలను ముంబయి అర్బన్ పరిధిని దాటి ఆలోచించలేకపోతోంది. సౌత్ వారిలాగా కథ మూలాల్లోకి వెళ్లాలి. ఈ విషయంలో వారిని చూసి నేర్చుకోవాలి’ అని చెప్పుకొచ్చారు.
ఇక చిరంజీవితో కలిసి నటించడంపై స్పందించిన సల్మాన్.. ‘చిరంజీవి గారు నాకు చాలా కాలంగా తెలుసు. అతనితో కలిసి నటించడం అద్భుత అనుభూతి. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా నాకు మంచి స్నేహితుడు. ఆర్‌ఆర్‌ఆర్‌తో అద్భత విజయాన్ని అందుకున్నాడు. రామ్ చరణ్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ విజయం సాధించడం సంతోషానిచ్చింది’ అని అన్నారు సల్మాన్ ఖాన్.
Also Read: Watermelon Seeds: పుచ్చకాయ గింజలను పడేస్తున్నారా..? లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Onion Health Benefits: వేసవిలో ఉల్లి మేలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Road Accident: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు