బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్(Rajkumar rao) పాన్ కార్డు(PAN Card) మోసానికి గురయ్యాడు. తన పేరు మీద రుణం తీసుకునేందుకు తన పాన్ కార్డు వివరాలను దుర్వినియోగం చేశారని రాజ్‌కుమార్ రావు తెలిపారు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ మోసం కారణంగా తన క్రెడిట్ స్కోర్(Credit score) ప్రభావితమైందని 37 ఏళ్ల నటుడు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా ఆయన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ ( సిబిల్ ) అధికారులను కోరారు. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ నటి సన్నీలియోన్ మోసానికి గురైన సంగతి తెలిసిందే. తన పాన్ కార్డ్ ఉపయోగించి ‘ధాని’ యాప్ ద్వారా ఎవరో రూ.2,000 రుణం తీసుకున్నారని నటి పేర్కొంది.
“#FraudAlert, నా పాన్ కార్డ్ దుర్వినియోగం అయింది. నా పేరు మీద 2,500 రూపాయల రుణం తీసుకున్నారు. దీని కారణంగా నా CIBIL స్కోర్ ప్రభావితమైంది. @CIBIL_Official దయచేసి దీన్ని పరిష్కరించండి.” అని ట్వీట్ చేశాడు. దీనిపై CIBIL ఇంకా స్పందించలేదు. పాన్ కార్డు మోసానికి రాజ్‌కుమార్ రావ్ ఒక్కరే కాదు చాలా మంది బాధితులుగా మారుతున్నారు. మీకు కావాలంటే, మీరు పాన్ కార్డ్ చరిత్రను తెలుసుకోవచ్చు, తద్వారా మీ పాన్ లావాదేవీల కోసం ఎక్కడ ఉపయోగించబడిందో మీకు తెలుస్తుంది. పాన్ తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఉపయోగించండి. మీరు పాన్ హార్డ్ కాపీని ఇస్తున్నట్లయితే, దానిపై సంతకం చేసి, తేదీని వ్రాసి, మీరు ఏ ప్రయోజనం కోసం పాన్ ఉపయోగిస్తున్నారో కూడా రాయండి. మీకు పాన్ ఉంటే, ఖచ్చితంగా ఆదాయపు పన్ను పోర్టల్‌లో ఖాతాను సృష్టించండి. దీని వల్ల నష్టమేమీ లేదు, భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది.
ఇలా తనిఖీ చేయండి
మీ పాన్ కార్డు చరిత్రను తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి, ఆపై సేవల విభాగానికి వెళ్లి, ఫారం 26ASపై క్లిక్ చేయండి. PAN చరిత్రను తెలుసుకోవడానికి ఫారమ్ 26ASని డౌన్‌లోడ్ చేయండి. 26AS ఫారమ్‌లో లావాదేవీలను తనిఖీ చేయవచ్చు.
#FraudAlert My pan card has been misused and a small loan of Rs.2500 has been taken on my name. Due to which my cibil score has been affected. @CIBIL_Official please rectify the same and do take precautionary steps against this.
— Rajkummar Rao (@RajkummarRao) April 2, 2022
Read Also.. Aadhaar Mobile Number: మీ ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింక్ చేశారో తెలియడం లేదా..? సులభంగా తెలుసుకోవచ్చు..!