Bank Of Baroda: మరో కొత్త డిపాజిట్ స్కీమ్ లాంచ్ చేసిన బీఓబీ.. నమ్మలేని వడ్డీ రేటు మీ సొంతం
2022 నుంచి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి. అయితే గత నాలుగు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచడంతో వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ పడింది. కొన్ని రకాల బ్యాంకులు మాత్రం వినియోగదారులకు ఆకట్టుకోవడానికి ప్రత్యేక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా బాబ్ 360 డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇది 360 రోజులకు సంవత్సరానికి వర్తిస్తుంది.
కష్టపడి సంపాదించిన సొమ్ముకు మంచి రాబడి కోసం వివిధ పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇలాంటి పథకాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. 2022 నుంచి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి. అయితే గత నాలుగు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచడంతో వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ పడింది. కొన్ని రకాల బ్యాంకులు మాత్రం వినియోగదారులకు ఆకట్టుకోవడానికి ప్రత్యేక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా బాబ్ 360 డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇది 360 రోజులకు సంవత్సరానికి వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకొచ్చిన కొత్త పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకొచ్చిన 360 డిపాజిట్ స్కీమ్ 7.60 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ ప్రత్యేక స్వల్పకాలిక రిటైల్ డిపాజిట్ స్కీమ్ ఇందులో సీనియర్ సిటిజన్‌లకు సంవత్సరానికి 0.50 శాతం ఉంటుంది. ముఖ్యంగా ఈ డిపాజిట్లు రూ.2 కోట్ల వరకూ ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా చర్యలు బ్యాంకు స్వల్పకాలిక రిటైల్ టర్మ్ డిపాజిట్లలో వాటాను పెంచడానికి,. దాని డిపాజిట్ల వ్యయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సాయం చేస్తుందని నిపుణుల వాదన.
బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన ప్రస్తుత, కొత్త కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా బ్యాంకు శాఖల ద్వారా బాబ్ 360ని తెరవవచ్చు. అదే సమయంలో బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ (బాబ్ వరల్డ్ ఇంటర్నెట్) ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్ ఎఫ్‌డీను కూడా తెరవవచ్చు. ఇప్పటికే ఉన్న కస్టమర్లు మొబైల్ యాప్ (బాబ్ వరల్డ్) ద్వారా ఆన్‌లైన్ ఎఫ్‌డీని కూడా తెరవవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. గత నెలలో బ్యాంక్ ఆఫ్ బరోడా రుణదాత దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఎన్‌ఆర్‌ఓ టర్మ్ డిపాజిట్లతో సహా వివిధ మెచ్యూరిటీ బకెట్లపై 10 బేసిస్ పాయింట్ల నుంచి 125 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏడు రోజుల నుంచి 14 రోజుల మధ్య మెచ్యూరయ్యే రిటైల్ టర్మ్ డిపాజిట్ల కోసం, బ్యాంక్ ఆఫ్ బరోడా 4.25 శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు ఇలా
ఏడు రోజుల నుంచి 14 రోజుల వరకూ సాధారణ ప్రజలకు 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 15 రోజుల నుంచి 45 రోజుల వరకూ 4.50 శాతం, 5.00 శాతం అందిస్తారు. 46 రోజుల నుంచి 90 రోజుల వరకూ సాధారణ ప్రజలకు 5.50 శాతం, 6 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. 91 రోజుల నుంచి 180 రోజుల వరకూ 5.60 శాతం, 6.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 181 రోజుల నుంచి 210 రోజుల వరకూ 5.75 శాతం నుంచి 6.25 శాతం వడ్డీను అందిస్తుంది 211 రోజుల నుంచి 270 రోజుల వరకూ 6.15 శాతం నుంచి 6.65 శాతం వరకూ వడ్డీ రేటును అందిస్తుంది. 271 రోజుల నుంచి సంవత్సరం కంటే తక్కువ వ్యవధికి 6.25 శాతం నుంచి 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి