Bitcoins Forgotten Passwords: పాస్‌వర్డ్‌ మర్చిపోవడంతో క్లెయిమ్‌ చేసుకోలేని రూ.10 లక్షల కోట్లు

| Edited By: Anil kumar poka

Sep 27, 2021 | 8:52 AM

Bitcoins Forgotten Passwords: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి మంచి ఆదరణ లభిస్తోంది. బిట్‌కాయిన్‌ లాంటి క్రిప్టోకరెన్సీలు ప్రజల్లో ఎక్కువగా ఆదరణ..

Bitcoins Forgotten Passwords: పాస్‌వర్డ్‌ మర్చిపోవడంతో క్లెయిమ్‌ చేసుకోలేని రూ.10 లక్షల కోట్లు
Follow us on

Bitcoins Forgotten Passwords: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి మంచి ఆదరణ లభిస్తోంది. బిట్‌కాయిన్‌ లాంటి క్రిప్టోకరెన్సీలు ప్రజల్లో ఎక్కువగా ఆదరణ పొందాయి. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు పూర్తిగా ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నాయి. శక్తివంతమైన కంప్యూటర్ల సహయంతో, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని ఉపయోగించి క్రిప్టో లావాదేవీలు కొనసాగుతుంటాయి. అయితే బిట్‌కాయిన్స్‌ను కలిగిన పలు వ్యక్తులు తమ బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌కు పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోనే సౌకర్యం ఉంటుంది. బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌కు శక్తివంతమైన పాస్‌వర్డ్‌ సహాయంతో ఇతరులకు బిట్‌కాయిన్ల లావాదేవీలను చేయవచ్చును.

బిట్‌ కాయిన్‌ వ్యాలెట్ల పాస్‌వర్డ్‌ మర్చిపోతే..

ఒక వేళ బిట్‌కాయిన్‌ వ్యాలెట్ల పాస్‌వర్డ్‌ మర్చిపోతే మాత్రం బిట్‌కాయిన్‌ యూజర్లు తిరిగి పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌ పాస్‌వర్డ్‌ మర్చిపోతే.. బిట్‌కాయిన్లు ఆన్‌లైన్‌లో అలానే ఉండిపోతాయి. ది న్యూయర్క్‌ టైమ్స్‌ ప్రకారం.. దాదాపు 140 బిలియన్‌ డాలర్లు (రూ. 1,03,66,51,70,00,000 సుమారు పది లక్షల కోట్ల రూపాయలు) బిట్‌కాయిన్‌ వ్యాలెట్ల పాస్‌వర్డ్స్ మర్చిపోవడంతో ఈ మొత్తాన్ని బిట్‌కాయిన్‌ యూజర్లు క్లెయిమ్‌ చేసుకోలేదని తెలిపింది. క్రిప్టోకరెన్సీ డేటా సంస్థ చైనాలిసిస్‌ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. 18.6 బిలియన్‌ బిట్‌కాయిన్ల మైనింగ్‌లో 20 శాతం మేర బిట్‌కాయిన్స్‌లో ఏలాంటి లావాదేవీలు లేకుండా ఉన్నాయని తెలిపింది. ఆయా బిట్‌కాయిన్‌ వ్యాలెట్ల యూజర్లు పాస్‌వర్డ్స్‌ను మర్చిపోవడమే దీనికి కారణమని చైనాలిసిస్‌ పేర్కొంది.

బిట్‌కాయిన్‌ వ్యాలెట్ల పాస్‌వర్డ్‌లను మర్చిపోయినా బిట్‌కాయిన్‌ యూజర్లకు డార్క్‌వెబ్‌లోని ఆన్‌లైన్‌ హ్యాకర్లే దిక్కుగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయా బిట్‌కాయిన్‌ వ్యాలెట్లను యాక్సెస్‌ చేసేందుకు బిట్‌కాయిన్‌ యూజర్లు హ్యకర్ల సహయాన్ని తీసుకుంటున్నారు. బిట్‌కాయిన్‌ వ్యాలెట్లను రికవరీ చేసిన హ్యకర్లకు కొత్త మొత్తాన్ని బిట్‌కాయిన్‌ యూజర్లు చెల్లిస్తున్నట్లు క్రిప్టో అసెట్‌ రికవరీ టీమ్‌ వెల్లడించింది. కాగా బిట్‌కాయిన్‌ వ్యాలెట్లను రికవరీ చేసే సంభావ్యత కేవలం 27 శాతంగానే ఉంది.

దేశంలో అన్ క్లెయిమ్డ్ ఖాతాల్లో ఉన్న డబ్బులు.. అంచనాల ప్రకారం..
ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు రూ. 26,497 కోట్లు, బ్యాంకు ఖాతాలు రూ. 18,381 కోట్లు, ఇనాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఖాతాలు రూ. 17,880 కోట్లు, అన్ క్లెయిమ్డ్ ఎల్‌ఐసీ పాలసీలు రూ. 15,167 కోట్లు, మెచ్యూర్డ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ. 4,820కోట్లు, అన్ క్లెయిమ్డ్ డివిడెండ్లు రూ. 4,100కోట్లు ఉన్నాయి. మొత్తం రూ. 82,025 కోట్లు.

ఇవీ కూడా చదవండి:

SBI Customers Alert: మీ మొబైల్‌లో ఈ నాలుగు యాప్స్‌ ఉన్నాయా..? వెంటనే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ

Salary Hike: ఉద్యోగులకు శుభవార్త.. వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు.. ఏ రంగాల వారికి అంటే..