Swiggy: స్విగ్గీలో సెకన్‌కు ఎన్ని బిర్యానీలు ఆర్డర్ పెడుతున్నారో తెలిస్తే కళ్లు తేలేస్తారు..!

|

Dec 16, 2022 | 5:52 PM

2014లో స్థాపించబడిన Swiggy ప్రస్తుతం వందలాది నగరాల్లోని 2,00,000 రెస్టారెంట్ భాగస్వాములకు.. వినియోగదారులను మధ్య అనుసంధాన కర్తగా ఉంటుంది.

Swiggy: స్విగ్గీలో సెకన్‌కు ఎన్ని బిర్యానీలు ఆర్డర్ పెడుతున్నారో తెలిస్తే కళ్లు తేలేస్తారు..!
Biryani
Follow us on

క్లిక్ చేస్తే.. నిమిషాల్లో పార్శిల్‌.. కోరుకున్నది, కోరుకున్నంత.. కస్టమర్లు నెట్‌లో ఆర్డర్‌ చేస్తూ నట్టింట్లో తెగ తినేస్తున్నారు. ఈ ఏడాది స్విగ్గీకి కళ్లు చెదిరే ఆర్డర్లు సొంతం చేసుకుంది. సెకన్‌కి 2.28 బిర్యానీ ఆర్డర్‌లతో సరికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేసింది. అంతేకాదూ విదేశీ రుచులను కూడా కస్టమర్లకు పరిచయం చేసి ఆకట్టుకుంది స్విగ్గీ. ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ సంస్థలకు రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. దేశంలో లక్షలాది మంది కస్టమర్ల ఆకలి తీర్చేందుకు ఇవి కేరాఫ్‌గా మారాయి. ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ చేసుకుంటున్న వాళ్లు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్న ఐటెమ్ ఏంటో తెలుసా? నో డౌట్‌.. వన్ అండ్ ఓన్లీ బిర్యానీ. హైదరాబాదీల ఇష్టమైన వంటకం బిర్యానీని భారతీయులు ఏం రేంజ్‌లో తింటున్నారో తెలుసా? ఒక్క స్విగ్గీలోనే సెకన్‌కి 2.28 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారు. 2022లో ఈ స్థాయి బిర్యానీ ఆర్డర్‌లతో స్విగ్గీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

2014లో స్విగ్గీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. వందలాది నగరాల్లో సేవలందిస్తూ.. 2లక్షల రెస్టారెంట్లతో ఒప్పందాలు చేసుకుంది. కొత్తగా శ్రీనగర్‌, పోర్ట్ బ్లెయిర్‌, మున్నార్‌, ఐజ్వాల్‌, జల్నా, భిల్వారాతో పాటు మరికొన్ని నగరాల్లో తమ కస్టమర్లు తొలిసారిగా ఆర్డర్లు చేశారని సగర్వంగా ప్రకటించుకుంది స్విగ్గీ. బిర్యానీ, ఇటాలియన్ రావియోలీ (ఒక రకమైన పాస్తా), కొరియన్ బిబింబాప్‌(రైస్ డిష్)ను కస్టమర్లు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. వాటి తర్వాత పిజ్జా, బర్గర్, టీ, కాఫీ లాంటి ఐటెమ్స్ ఉన్నాయి. గత సంవత్సరం, దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా కొత్త రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్‌లు స్విగ్గిలో చేరాయి.

రికార్డ్‌ స్థాయి ఆర్డర్ల వెనుక స్విగ్గీ వన్ ఆఫర్‌ కీలకంగా మారింది. ఈ ఆఫర్‌ కింద ఉచితంగా డెలివరీలు అందిస్తోంది. అలాగే తక్కువ ధరలతో కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తోంది. వీటికి తోడు మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ మరింత ప్లస్‌ అయింది. స్విగ్గీ వన్ ఆఫర్‌తో అత్యధికంగా ఆదా చేసిన నగరంగా బెంగళూరు నిలిచింది. ఈ నగరానికి చెందిన కస్టమర్లు ఏకంగా వందకోట్ల రూపాయలకు పైగా ఆదా చేశారంటోంది స్విగ్గీ. ఢిల్లీకి చెందిన ఓ కస్టమర్‌ స్విగ్గీ వన్‌ ఆఫర్‌తో 2లక్షల 48వేల రూపాయలు ఆదా చేశారని ప్రకటించింది. ముంబై, హైదరాబాద్‌, ఢిల్లీకి చెందిన చాలామంది కస్టమర్స్‌ స్విగ్గీ వన్ ఆఫర్‌తో చాలా ఆదా చేసుకున్నారని స్విగ్గీ చెబుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..