Medicine Price: సామాన్యులకు భారీ ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం.. 35 రకాల మందుల ధరలు తగ్గింపు!

Medicine Price: కేంద్రం సామాన్యులకు భారీ ఊరట కల్పించింది. 35 రకాల మందులను ధరలను తగ్గించింది. NPPA ద్వారా విలువ నియంత్రణ ఆధారంగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ఔషధాలకు వర్తించే ధర తగ్గింపు వినియోగదారులకు, ముఖ్యంగా..

Medicine Price: సామాన్యులకు భారీ ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం.. 35 రకాల మందుల ధరలు తగ్గింపు!

Updated on: Aug 04, 2025 | 12:22 PM

రోగులకు మందులను మరింత సరసమైనదిగా చేయడానికి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ప్రధాన ఔషధ కంపెనీలు విక్రయించే 35 ముఖ్యమైన ఔషధాల రిటైల్ ధరలను తగ్గించింది. ఇప్పుడు ఈ తక్కువ ధర గల ఫార్ములాల్లో గుండె సంబంధిత, యాంటీబయాటిక్, యాంటీ-డయాబెటిక్, మానసిక వ్యాధులు వంటి అనేక రకాల మందులు ఉన్నాయి. NPPA ద్వారా విలువ నియంత్రణ ఆధారంగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ఔషధాలకు వర్తించే ధర తగ్గింపు వినియోగదారులకు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. అయితే తగ్గించిన ధరలను అధిక ధరలకు విక్రయించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Bike Servicing: బైక్‌ను ఎన్ని కి.మీ తర్వాత సర్వీస్ చేయాలి? సరైన సమయం ఏది?

ఏయే మందులు తగ్గనున్నాయి:

ఇవి కూడా చదవండి

తగ్గించిన వాటిలో చాలా మందులు ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేస్తున్న ఏసెక్లోఫెనాక్, పారాసెటమాల్, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ కాంబినేషన్ టాబ్లెట్ ధరను రూ. 13గా ఎన్‌పీపీఏ నిర్ధారించింది. ఇదే ఫార్ములేషన్‌తో క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ విక్రయించే టాబ్లెట్ ధర రూ. 15.01గా నిర్ణయించారు. అలాగే గుండె జబ్బులకు ఉపయోగించే అటోర్‌వాస్టాటిన్ (40 ఎంజీ), క్లోపిడోగ్రెల్ (75 ఎంజీ) కలిగిన టాబ్లెట్ ధరను రూ. 25.61గా నిర్ణయించారు. వీటితో పాటు విటమిన్ డి లోపానికి వాడే కోలికాల్సిఫెరాల్ చుక్కల మందు, చిన్న పిల్లలకు ఇచ్చే సెఫిక్సిమ్, పారాసెటమాల్ ఓరల్ సస్పెన్షన్, నొప్పి నివారణకు ఉపయోగించే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ (ఒక మిల్లీలీటర్‌కు రూ. 31.77) వంటి వాటిని కూడా తగ్గించారు.

నిబంధనలు తప్పనిసరి:

అయితే అమల్లోకి వచ్చిన ఈ కొత్త ధరలు ప్రతి మెడికల్‌ షాపులలో డిస్‌ప్లే చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఈ మందులకు జీఎస్టీ అదనంగా ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అధికారిక ఉత్తర్వులో ఏం ఉంది?

అధికారిక ఉత్తర్వు ప్రకారం.. రిటైలర్లు, డీలర్లు తమ షాపులలో ధరల వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించింది. నోటిఫైడ్ ధరలను పాటించకపోతే DPCO, 2013, నిత్యావసర వస్తువుల చట్టం, 1955 ప్రకారం జరిమానా విధించవచ్చు. అలాగే వడ్డీతో పాటు అదనపు మొత్తాన్ని తిరిగి పొందడం కూడా ఇందులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్‌.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి