Rakesh Jhunjhunwala: గతం కొంతకాలంగా తన పెట్టుబడులను ఆ కంపెనీలో అలాగే బిగ్ బుల్(Big Bull) రాకేశ్ జున్‌జున్‌వాలా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్కార్ట్స్(Escorts) కంపెనీలో 64 లక్షల షేర్లను కలిగి ఉన్నారు బిగ్ బుల్. తాజాగా ఈ ఆటో దిగ్గజ కంపెనీలో తన పెట్టుబడులను ఆయన మరింతగా పెంచారు. ఇప్పటి వరకు కంపెనీలో 5.22 శాతం వాటాలు కలిగి ఉన్న ఆయన దానిని తాజా ఫిబ్రవరి చివరి నాటికి కొత్త పెట్టుబడులతో 5.80 శాతానికి పెంచారు. రాకేశ్ జున్ జున్ వాలాకు చెందిన హోల్డింగ్ కంపెనీ గత నెల 18న కొత్తగా 11 లక్షల ఎస్కార్ట్స్ షేర్లను కొనుగోలు చేయటంతో మెుత్తం షేర్ల సంఖ్య 75 లక్షలకు చేరింది.
కంపెనీ పూర్తి పెయిడ్ అప్ క్యాపిటల్ వివరాల ప్రకారం 75 లక్షల షేర్లతో 5.80 శాతం వాటాను రాకేశ్ కలిగి ఉన్నారు. అదే గడచిన త్రైమాసిక లెక్కల ప్రకారం కంపెనీలో రాకేశ్ 5.22 శాతం వాటాలను కలిగి ఉన్నారు. దీని ప్రకారం బిగ్ బుల్ పోర్ట్ ఫోలియోలో కొత్తగా 11 లక్షల షేర్లు చేరాయి. ఎస్కార్ట్స్ ఒక్కో షేరు ధర రూ. 1870 ఉండగా.. 75 లక్షల షేర్ల విలువ సుమారు రూ. 1400 కోట్లుగా ఉంది.
ఎస్కార్ట్స్ షేరు ధర గత ఒక నెలలో సైడ్ వేస్ లో ట్రేడ్ అయింది. ఈ కాలంలో షేరు ధర ఒక శాతం కంటే కొంచెం ఎక్కువగా పెరిగింది. అయితే, గత ఆరు నెలల్లో, ఎస్కార్ట్స్ షేరు ధర దాదాపు ₹1310 నుంచి ₹1870 వరకు ఒక్కో స్థాయికి పెరిగింది. ఇది 40 శాతం కంటే ఎక్కువ పెరుగుదల. బహుశా ఈ కారణంగానే రాకేశ్ జున్‌జున్‌వాలా ఆటో మేజర్ గురించి తన నమ్మకాన్ని న్యూట్రల్ నుంచి బుల్లిష్‌కి మార్చడానికి కారణం కావచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ షేరు ధర స్వల్ప కాలంలో రూ. 1900 నుంచి రూ. 1950 వరకు చేరవచ్చని చాయిస్ బ్రోకింగ్ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ షేరుపై వారు బులిష్ గా ఉన్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి..
Insurance To Wifes: గృహిణులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీ.. దీనితో అసలు ప్రయోజనమెంత..