Youtube: యూట్యూబ్ భారీ షాక్.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం ఏంటే తెలుసా?
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా భారీ చర్య తీసుకుంది. 9 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించింది. యూట్యూబ్ నుండి 22.5 లక్షలకు పైగా వీడియోలు డిలీట్ చేసింది. ఈ చర్యలు భారత్‌పై అతిపెద్ద ప్రభావం చూపింది. YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే వీడియోలపై Google ఈ చర్య తీసుకుంది. ఈ గణాంకాలు అక్టోబర్ నుండి డిసెంబర్ 2023..
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా భారీ చర్య తీసుకుంది. 9 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించింది. యూట్యూబ్ నుండి 22.5 లక్షలకు పైగా వీడియోలు డిలీట్ చేసింది. ఈ చర్యలు భారత్‌పై అతిపెద్ద ప్రభావం చూపింది. YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే వీడియోలపై Google ఈ చర్య తీసుకుంది. ఈ గణాంకాలు అక్టోబర్ నుండి డిసెంబర్ 2023 మధ్య ఉన్నాయి. వీడియో తీసివేత గురించి కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో తెలియజేసింది.
గూగుల్ పారదర్శకత నివేదిక ప్రకారం, గత సంవత్సరం అక్టోబర్ – డిసెంబర్ మధ్య మొత్తం 30 దేశాల నుండి అత్యధిక సంఖ్యలో వీడియోలను తొలగించింది. వీడియోలు తొలగింపులో భారతదేశం మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత సింగపూర్ రెండో స్థానంలో ఉంది. 12.4 లక్షల వీడియోలు తొలగించింది. ఇక 7.8 లక్షల వీడియోలతో అమెరికా మూడో స్థానంలో ఉంది. YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఈ వీడియోలను తొలగించినట్లు తెలిపింది.
మెషీన్ లెర్నింగ్, హ్యూమన్ రివ్యూయర్ల ద్వారా ఈ విధానం అమలు అవుతున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తన పోస్ట్‌లో తెలిపింది. కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘన కారణంగా వీడియో తీసివేయబడితే, అది పూర్తిగా తొలగించింది. అంటే ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ మీరు ఆ వీడియోను చూడలేరు.
30 దేశాల నుండి వీడియోలు తొలగింపు
41,176 వీడియో తొలగింపులతో 30 దేశాల జాబితాలో ఇరాక్ చివరి స్థానంలో ఉంది. యూట్యూబ్ నివేదిక ప్రకారం, ఎలాంటి వ్యూస్ రాని 51.51 శాతం వీడియోలు తొలగించింది. 1 నుండి 10 వీక్షణలతో వీడియోల వాటా 26.43 శాతం. ఇది కాకుండా, 10,000 కంటే ఎక్కువ వీక్షణలు పొందిన 1.25 శాతం వీడియోలు ఉన్నాయి.
హానికరమైన, ప్రమాదకరమైన వీడియోలు తొలగింపు:
అత్యధిక సంఖ్యలో హానికరమైన, ప్రమాదకరమైన వీడియోలు తొలగించింది. మొత్తం తొలగించబడిన వీడియోలలో ఈ వర్గం 39.2 శాతంగా ఉంది. దీని తర్వాత 32.4 శాతం వీడియోలు చైల్డ్ ప్రొటెక్షన్‌ను పాటించనందున తొలగించడం జరిగింది. 7.5 శాతం హింసాత్మక, 5.5 శాతం నగ్న వీడియోలు ఉన్నాయి. స్కామ్‌లు, తప్పుదారి పట్టించే మెటాడేటా లేదా థంబ్‌నెయిల్‌లు, వీడియోలు, కామెంట్‌లతో సహా 2023 స్పామ్ కంటెంట్ కారణంగా 20 మిలియన్లకు పైగా YouTube ఛానెల్‌లు కూడా తొలగించింది.