UPI payments: ఫేస్ రికగ్నేషన్‌తో యూపీఐ పేమెంట్స్.. అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది.. యాక్టివేట్ చేస్కోండి

బీమ్ యాప్ వినియోగించేవారికి శుభవార్త. ఇక నుంచి యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే పేమెంట్స్ చేయవచ్చు. ఈ మేరకు ఎన్‌పీసీఐ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఇక నుంచి బయెమెట్రిక్స్ విధానంలో చెల్లింపులు చేయవచ్చు. దీనిని యాప్‌లోకి వెళ్లి యాక్టివేట్ చేసుకోవాలి. ఎలా అంటే..

UPI payments: ఫేస్ రికగ్నేషన్‌తో యూపీఐ పేమెంట్స్.. అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది.. యాక్టివేట్ చేస్కోండి
Upi Advanced Features 2026.jpg

Updated on: Mar 24, 2026 | 9:41 PM

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న బీమ్ యాప్‌లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్ చేయాలంటే నాలుగు లేదా ఆరు అంకెల యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు నాలుగు అంకెల పిన్ విధానాన్ని పాటిస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు ఆరు అంకెల విధానాన్ని పాటిస్తున్నారు. వ్యక్తిగత పిన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తేనే యూపీఐ ద్వారా నగదు బదిలీ అవుతాయి. కానీ బీమ్ యాప్‌లో ఈ పిన్ అవసరం లేకుండా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.

బయోమెట్రిక్స్ సాయంతో పేమెంట్స్

బీమ్ యాప్‌లో ఎన్‌పీసీఐ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. బయోమెట్రిక్ సాయంతో పేమెంట్స్ చేసే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నేషన్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. కానీ రూ.5 వేలలోపు లావాదేవీలకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. అంతకుపైగా పేమెంట్స్‌కు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐఓఎస్ వెర్షన్లలో కూడా ఈ ఫీచర్ పనిచేస్తుందని బీమ్ యాప్ తెలిపింది. బయోమెట్రిక్స్ సాయంతో వేగంగా, సులువుగా చెల్లింపులు చేయవచ్చు. ఫోన్‌లోనే ఎన్‌క్రిప్షన్ రూపంలో బయోమెట్రిక్ డేటా ఉంటుంది. దీంతో దుకాణాల్లో, ఇతర చోట్ల చిన్న మొతాల్లో రూ.5వేలలోపే వేగంగా చెల్లింపులు చేయొచ్చు.

యాక్టివేట్ ఎలా చేసుకోవాలంటే..?

-బీమ్ యాప్‌ను ఓపెన్ చేయండి

-ప్రొఫైల్‌ సెక్షన్‌లోకి వెళ్లండి

-బ్యాంక్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోండి

-బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి

-ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నేషన్ ఐడీని వెరిఫై చేయండి

Follow Us