Bharti Airtel: ఎయిర్‎టెల్ కస్టమర్లకు షాక్.. రీఛార్జ్ ఛార్జీలు పెంచిన కంపెనీ.. ఎంతంటే..

|

Nov 22, 2021 | 10:41 AM

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‎టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది.  నవంబర్ 26 నుండి ప్రీ-పెయిడ్ కస్టమర్లకు 20-25 శాతం వరకు టారిఫ్‌లను పెంచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Bharti Airtel: ఎయిర్‎టెల్ కస్టమర్లకు షాక్.. రీఛార్జ్ ఛార్జీలు పెంచిన కంపెనీ.. ఎంతంటే..
Airtel
Follow us on

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‎టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది.  నవంబర్ 26 నుండి ప్రీ-పెయిడ్ కస్టమర్లకు 20-25 శాతం వరకు టారిఫ్‌లను పెంచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 5Gలో కొత్త పెట్టుబడులకు ముందు కంపెనీ లాభాలను పెంచుకోవడానికి టారిఫ్‎లు పెంచినట్లు తెలుస్తుంది. ప్రవేశ టారిఫ్‌ వాయిస్‌ ప్లాన్‌లపై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్‌ కాల్స్‌ ప్లాన్లపై 25 శాతం వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు వల్ల ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU) రూ.200-300కు చేర్చాలని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది! అప్పుడే మూలధనంపై సహేతుకమైన రాబడి ఉంటుందని.. ఇది ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాకు దారితీస్తుందని వివరించింది. ఆర్‌పీయూ ఆదాయం పెరగడం వల్ల నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రం కొనుగోళ్లలో గణనీయ పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

“ARPU నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రమ్‌లో అవసరమైన గణనీయమైన పెట్టుబడులను ఎనేబుల్ చేస్తుందని కూడా మేము నమ్ముతున్నాం.” అని కంపెనీ తెలిపింది. ఇతర ఆపరేటర్లు, ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వోడాఫోన్ ఐడియా దీనిని అనుసరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీ-పెయిడ్ వాయిస్, డేటా బండిల్ ప్లాన్‌లకు మార్పులు చేస్తూ ఎయిర్‌టెల్ కనీస వాయిస్ టారిఫ్ ప్లాన్‌ను రూ.79 నుండి రూ.99కి పెంచింది.
ఛార్జీల పెంపు ప్రకటనతో ఎయిర్‌టెల్‌ షేర్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Read Also.. Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ పరిణామాలే కారణమా..