Airtel Offer: భారత టెలికాం రంగంలో(Telecom sector) రోజురోజుకూ పెరుగుతున్న పోటీతో వినియోగదారులను ఆకర్షించటానికి కంపెనీలు అనేక ఆఫర్ ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ఈ ప్లాన్స్‌తో పలు ఓటీటీ(OTT) సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ తన యూజర్లకు ఇలాంటి బంపరాఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఉచితంగా డిస్నీ+హట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సేవలను ఉచితంగా పలు బండిల్ ప్లాన్స్‌తో అందిస్తోని మనకు తెలిసిందే. తాజాగా.. పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఫ్యామిలీ రీఛార్జ్ ప్లాన్స్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్‌తో ఆయా ఎయిర్‌టెల్ యూజర్లు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సేవలను పొందవచ్చునని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. రూ. 1199, రూ. 1599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఇక రూ. 1599 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌తో పాటుగా, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.
అంతేకాకుండా 500GB వరకు డేటా రోల్‌ఓవర్‌తో వస్తోంది. ఇది అపరిమిత లోకల్, STD , రోమింగ్ కాల్స్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా.. అపరిమిత కాల్‌లు హ్యాండ్‌సెట్ రక్షణతో ఉచిత యాడ్-ఆన్ కనెక్షన్‌ని కూడా అందిస్తోంది. ఇంతకుముందు ఉన్న రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను సవరిస్తూ.. రూ. 1199 ప్లాన్ ను ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. ఈ సర్వీసులను పొందాలంటే ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో సబ్‌స్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి..
Vodafone Idea: వొడాఫోన్ ఐడియా 8000 SIM కార్డ్‌లను బ్లాక్ చేసింది.. కారణం ఏంటంటే..!