AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BGAUSS Electric Scooter: రూ. లక్షలోపు ధరలోనే ‘పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ స్కూటర్’.. పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీతో..

మన దేశీయ బ్రాండ్ అయిన బీగాస్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సీ12ఐ ఎక్స్ ప్రిమీయం ను లాంచ్ చేసింది. అది కూడా కేవలం రూ. 99,999 ఎక్స్ షోరూం ధరకే అందిస్తోంది. ఎవరైతే సిటీ పరిధిలో ఇంటి అవసరాలకు స్కూటర్ కావాలని కోరుకుంటారో వారికి ఇది బెస్ట్ చాయిస్ గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. అంతేకాక దీనికి పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ స్కూటర్ అని ట్యాగ్ లైన్ ఇచ్చి మరి బీగాస్ ఈ స్కూటర్ ని ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

BGAUSS Electric Scooter: రూ. లక్షలోపు ధరలోనే ‘పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ స్కూటర్’.. పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీతో..
Bgauss C12i Ex Premium Electric Scooter
Madhu
|

Updated on: Sep 06, 2023 | 5:39 PM

Share

మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. సంప్రదాయ ఇంధన ధరలు బాగా పెరుగుతుండటం, లోకల్ అవసరాలకు ఈస్కూటర్లు బాగా ఉపయోగపడుతుండటంతో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీంతో అన్ని కంపెనీలు తమ తమ ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఆయా కంపెనీల మధ్య ఇప్పటికే పోటీ వాతావరణం ఏర్పడింది. దీంతో తక్కువ ధర, అధిక ఫీచర్లు ఉన్న స్కూటర్లను తీసుకొచ్చేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో మన దేశీయ బ్రాండ్ అయిన బీగాస్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సీ12ఐ ఎక్స్ ప్రిమీయం ను లాంచ్ చేసింది. అది కూడా కేవలం రూ. 99,999 ఎక్స్ షోరూం ధరకే అందిస్తోంది. ఎవరైతే సిటీ పరిధిలో ఇంటి అవసరాలకు స్కూటర్ కావాలని కోరుకుంటారో వారికి ఇది బెస్ట్ చాయిస్ గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. అంతేకాక దీనికి పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ స్కూటర్ అని ట్యాగ్ లైన్ ఇచ్చి మరి బీగాస్ ఈ స్కూటర్ ని ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బీగాస్ సీ12ఐ ఎక్స్ ప్రీమియం స్కూటర్ ధర, లభ్యత..

ఈ కొత్త స్కూటర్ ధర మన దేశంలో రూ. 99,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఇంతకు ముందు విడుదల చేసిన సీ12ఐ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,26,513(ఎక్స్ షోరూం ఢిల్లీ) కాగా, మూడు నెలల్లోనే ఏకంగా 6000 కస్టమర్లు దీనిని కొనుగోలు చేసినట్లు బీగాస్ తెలిపింది. ఇప్పుడు విడుదల చేస్తున్న సీ12ఐ ఎక్స్ స్కూటర్ పై కూడా అదే రకమైన ఆసక్తి ఉందని చెబుతున్నారు.

బీగాస్ సీ12ఐ ఎక్స్ ప్రీమియం స్కూటర్ బ్యాటరీ, రేంజ్..

బీగాస్ సీ12ఐ ఎక్స్ ప్రీమియం స్కూటర్లో రీమూవబుల్ 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఫుల్ చార్జ్ అవడానికి మూడు గంటల సమయం తీసుకుంటుంది. సింగిల్ చార్జ్ పై 85 కిలోమీటర్ల రేంజ్ ఇది ఇస్తుంది. దీనిలో హబ్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది. ఇది 3.3 బీహెచ్ పీ, 10.7 కేజీఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.

ఇవి కూడా చదవండి

బీగాస్ సీ12ఐ ఎక్స్ ప్రీమియం స్కూటర్ డిజైన్..

ఈ కొత్త స్కూటర్ అవుట్ లుక్ చాలా సింపుల్ గా ఉంటుంది. డ్యూయ్ టోన్ పెయింట్ మీకు దీనిని అందంగా కనిపించేలా చేస్తుంది. హెడ్ లైట్ రౌండ్ డిజైన్ లో ఉంటుంది. రెట్రో లుక్ లో ఇది కనిపిస్తుంది.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. బీగాస్ కంపెనీ దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. అయితే లో బ్యాటరీ మోడ్ ఉంటుందని మాత్రం ప్రకటించింది. ఈ మోడ్లో స్కూటర్ కేవలం గంటలకు 20కిలమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలుగుతుంది.

మేడ్ ఇన్ ఇండియా స్కూటర్..

ఈ స్కూటర్ ఆవిష్కరణ సందర్భంగా బీగాస్ ఫౌండర్ అండ్ సీఈఓ హేమంత్ కాబ్రా మాట్లాడుతూ ఇది 100శాతం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి అని పేర్కొన్నారు. ఇంతకుముందు మోడల్ సీ12ఐ మ్యాక్స్ ను దేశీయ వినియోగదారులు బాగా ఆదరించారని, ఈ కొత్త సీ12ఐ ఎక్స్ ని కూడా అదే స్థాయిలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దామని చెప్పారు. దీనిని వినియోగదారులు ఆదరించాలని కోరారు. ప్రస్తుతానికి ఈ స్కూటర్ కేవలం రూ. 99,999కే లభ్యవమతుందని, అయితే ఇది కేవలం ప్రారంభ ఆఫర్ మాత్రమేనని, సెప్టెంబర్ 19 వరకూ మాత్రమే ఈ ధర ఉంటుందని చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..