మీరు కొత్త స్కూటర్ కొనాలని అనుకొంటున్నారా? అది కూడా ఎలక్ట్రిక్ వేరియంట్ అయితే బాగుండని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. అత్యాధునిక భద్రతా ఫీచర్లు.. హై బ్యాటరీ రేంజ్, ఫాస్ట్ యాక్సలెరేషన్ తో Bgauss D15 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు దారులను ఆకర్షిస్తోంది. అందుబాటు బడ్జెట్ లో హై ఎండ్ ఫీచర్లతో రైడర్లకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది. దీంతో ఈ బైక్ ఇటీవల బుకింగ్స్ పెరిగాయి. స్పోర్టీ లుక్ ఉండే ఈ స్కూటర్ లో ఏకంగా 20 కంటే ఎక్కువగా భద్రతా ఫీచర్లను అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ బిగాస్(Bgauss) భారతదేశంలో తన మూడో ఎలక్ట్రిక్ స్కూటర్ బిగాస్ డీ15(Bigaus D15)ను ఇటీవల విడుదల చేసింది. ఈ స్కూటర్‌లో లాంగ్ రేంజ్‌తో దాదాపు 2 డజన్ల భద్రతా ఫీచర్లు ఉన్నాయని లాంచింగ్ అప్పుడు కంపెనీ పేర్కొంది. రెండు వేరియంట్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. బిగాస్ డీ15ఐ, బిగాస్ డీ15 ప్రో. బిగాస్ డీ15ఐ ధర ధర 99,999(ఎక్స్ షోరూమ్), బిగాస్ డీ15 ప్రో ధర రూ. 1,14,999(ఎక్స్ షోరూమ్) గా ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కస్టమర్‌లు దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవడానికి కంపెనీ టోకెన్ మొత్తాన్ని రూ.499గా నిర్ణయించింది.
కంపెనీ స్కూటర్‌లో 3.2 kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. ఈ బ్యాటరీని 5 గంటల 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 115 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. వేగానికి సంబంధించి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 7 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ స్కూటర్‌లో, కంపెనీ రెండు రైడింగ్ మోడ్‌లను అందించింది, ఇందులో మొదటి మోడ్ ఎకో, రెండవది స్పోర్ట్ మోడ్.
బ్రేకింగ్ సిస్టమ్ ను పరిశీలిస్తే కంపెనీ స్కూటర్ యొక్క ముందు, వెనుక చక్రాలలో డ్రమ్ బ్రేక్‌లను ఇచ్చింది. దానితో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) జోడించబడింది. సస్పెన్షన్ సిస్టమ్ గురించి చెప్పాలంటే, ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపున స్ప్రింగ్ ఆధారిత షాక్ అబ్జార్బర్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
స్కూటర్, రైడర్ రెండింటి భద్రతను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఈ స్కూటర్‌లో యాంటీ థెఫ్ట్ అలారం, IP67 రేటెడ్ ఎలక్ట్రిక్ మోటార్, స్మార్ట్ బ్యాటరీ, మోటార్ కంట్రోలర్ వంటి ఫీచర్లను అందించింది. అంతేకాక రైడర్ భద్రతను దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక 20 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లను అందించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..