Electricity Bill Scam: మీ కరెంటు బిల్లు పేరుతో ఇలాంటి సందేశాలు వస్తున్నాయా..? జాగ్రత్త

|

May 31, 2023 | 4:50 AM

ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరా చేసుకుని నేరగాల్లు సులభంగా మోసగిస్తున్నారు. ఆన్‌లైన్‌ మోసాలు సైతం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లేనిపోని లింకులను పంపిస్తూ వారి అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు..

Electricity Bill Scam: మీ కరెంటు బిల్లు పేరుతో ఇలాంటి సందేశాలు వస్తున్నాయా..? జాగ్రత్త
Electricity Bill Scam
Follow us on

ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరా చేసుకుని నేరగాల్లు సులభంగా మోసగిస్తున్నారు. ఆన్‌లైన్‌ మోసాలు సైతం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లేనిపోని లింకులను పంపిస్తూ వారి అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్‌లో కరెంట్ బిల్లు బకాయి ఉందని ఆన్‌లైన్ ద్వారా సందేశాలు పంపి ప్రజలను మోసం చేస్తున్న అక్రమార్కులు ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెస్కామ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ప్రజలకు మెసేజ్‌లను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. విద్యుత్ సంస్థ పేరుతో మోసగాళ్లు మెసేజ్ లు పంపి ఫోన్ చేయాలని సూచించడం, లేని పక్షంలో డిస్ కనెక్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

దేశంలో చాలా రాష్ట్రాల్లో ‘ప్రియమైన కస్టమర్, మీ మునుపటి నెల బిల్లును అప్‌డేట్ చేయనందున ఈ రోజు రాత్రి 9.30 గంటలకు విద్యుత్ కార్యాలయం ద్వారా మీ విద్యుత్ కనెక్షన్ డిస్‌కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి వెంటనే మా విద్యుత్ అధికారిని సంప్రదించండి ధన్యవాదాలు’ అని మొబైల్ నంబర్‌తో పాటు సందేశం కూడా పంపుతున్నారట. ఈ సందేశం అధికారుల నుంచి రానప్పటికీ జనాలను నమ్మించి మోసగిస్తున్నారు. నిజంగానే విద్యుత్‌ డిస్‌కనెక్ట్‌ అవుతుందనే భయంతో సదరు వినియోగదారులు పంపిన నెంబర్‌కు ఫోన్‌ చేయగానే వారి వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా రాబట్టుకుంటున్నారు. ఇలా ఫోన్‌ చేయడం వల్ల వారి అకౌంట్‌లో ఉన్న డబ్బులన్ని ఖాళీ అయిపోతున్నాయి. తర్వాత అసలు విషయం తెలుసుకుని షాక్‌కు గురవుతున్నారు.

BESCOM నుండి హెచ్చరిక:

బెస్కామ్ ఏ మొబైల్ నంబర్ నుండి వినియోగదారులకు ఎలాంటి సందేశాలను పంపదు. అలాగే ఓటీపీ, పాస్‌వర్డ్ చెప్పాలని అడగదు. బెస్కామ్ పేరుతో ఓటీపీ, పాస్ వర్డ్ అడిగితే కచ్చితంగా మోసపూరిత నెట్ వర్క్ అని బెస్కామ్ హెచ్చరించింది. ‘బెస్కామ్ పేరుతో నకిలీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రావచ్చు. దయచేసి ఇలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడండి’ అని విద్యుత్ సరఫరా సంస్థ హెచ్చరిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఐటీ కంపెనీల్లో పని చేసేవారే..

ఐటీ కంపెనీల్లో ఏదో ఒక పని చేస్తున్న వాళ్లే ఎక్కువ మందికని టార్గెట్‌ చేస్తున్నారు.. ఈ రకమైన మోసం చాలా ప్రమాదకరమైనది. దీనిలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని మోసగాడు కస్టమర్‌ని ఆదేశిస్తాడు. ఇది ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత మోసగాడు మీ మొబైల్‌కు పూర్తి యాక్సెస్‌ను పొందుతాడు. మీ బ్యాంక్ వివరాలు, ఫోటోలు, వాట్సాప్‌ చాట్‌లు, ఇమెయిల్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. ఈ మోసాల వల్ల మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. అందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి