
నవంబర్ నెలలో పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లన్నీ తమ ఫ్లాగ్‌షిప్ రేంజ్ మొబైల్స్ ను లాంచ్ చేయనున్నాయి. వీటిలో కొన్ని మొబైల్స్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. నవంబర్ నెలలో ఇండియాలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ మొబైల్స్ కు చెందిన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ లిస్ట్ లో ఐకూ, వన్‌ప్లస్,రియల్‌మీ, ఒప్పో, రెడ్ మీ వంటి బ్రాండ్స్ కు చెందిన పలు కొత్త మోడల్స్ ఉన్నాయి. లిస్ట్ ఓసారి చూస్తే..
ఐకూ 15
ఐకూ నుంచి త్వరలో ఐకూ 15 సిరీస్ రాబోతోంది. ఇందులో 6.85 ఇంచెస్ LTPO అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 Elite జెన్ 5 ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. ఇందులో 50 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో పాటు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి. బ్యాటరీ కెపాసిటీ 7000 ఎంఏహెచ్‌ఉంటుంది. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 40 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
వన్‌ప్లస్ 15
వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి తమ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాబోతుంది. నవంబర్ నెలలో వన్ ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో 6.78 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Elite జెన్ 5 ప్రాసెసర్ పై పని చేస్తుంది. 50 ఎంపీతో కూడిన మూడు కెమెరాలు ఇందులో ఉంటాయి. మిగతా స్పెసిఫికేషన్లు తెలియాల్సి ఉంది.
వివో X 300 ప్రో
ఇక వివో నుంచి నవంబర నెలలో వివో X 300 ప్రో మొబైల్ రానుంది. ఇది కెమెరా పెర్ఫామెన్స్ లో హైలైట్ గా నిలువనుంది. ఇప్పటికే వివో X200 మొబైల్ కెమెరాకు మంచి రీవ్యూలు వచ్చాయి. బెస్ట్ మొబైల్ కెమెరాగా దాన్ని వర్ణిస్తున్నారు. అయితే ఇప్పుడు రాబోతున్న వివో X 300 ప్రోలో కెమెరా సెటప్ ఇంకా బెటర్ గా ఉండనుంది. ఇందులో 200 ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌తో పాటు 50 ఎంపీ ప్రైమరీ, 50 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్లతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉండనుంది. అలాగే ముందువైపు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో 6.78 అంగుళాల డిస్‌ప్లే.. 120Hz రిఫ్రెష్‌రేటుతో వస్తుంది., 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ పై పని చేస్తుంది. 6510 ఎంఏహెచ్ బ్యాటరీ.. 90 వాట్ వైర్డ్, 40 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
రియల్‌మీ జీటీ 8 ప్రో
ఇకపోతే రియల్‌మీ నుంచి వచ్చే నెలలో రియల్‌మీ జీటీ 8 ప్రో మొబైల్ రానుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఇందులో R1 గేమింగ్ చిప్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇందులో 50 ఎంపీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి