Post Office: డబుల్ ధమాకా.. మిమ్మల్ని లక్షాధికారులను ఈ 6 పోస్టాఫీస్ పథకాల గురించి తెలుసా?

పోస్ట్ ఆఫీస్‌లో అద్భుతమై స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో 6 ప్రధాన పెట్టుబడి పథకాలుగా చెప్పుకోవచ్చు. ఇవి సురక్షితమైన పొదుపుతో పాటు మెరుగైన రాబడి, పన్ను మినహాయింపు కోసం గొప్ప అవకాశాన్ని అందిస్తాయి. ఈ పథకాలు అన్ని వర్గాల పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా ఉంటాయి.

Post Office: డబుల్ ధమాకా.. మిమ్మల్ని లక్షాధికారులను ఈ 6 పోస్టాఫీస్ పథకాల గురించి తెలుసా?
జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం: NSC అనేది స్థిర ఆదాయ పొదుపు పథకం. దీనిలో ఎవరైనా ఖాతాను తెరవవచ్చు. ఇది పన్ను ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి ఇది చిన్న, మధ్యతరగతి ఆదాయ పెట్టుబడిదారులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకం 7.7% వడ్డీని అందిస్తుంది. కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000, గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.

Updated on: Sep 14, 2025 | 5:05 PM

మీ డబ్బును సేఫ్‌ ప్లేస్‌లో పెట్టుబడి పెట్టి.. అధిక రాబడి పొందాలని అనుకుంటున్నారా? అయితే పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు మీకు అత్యంత బెస్ట్ ఆప్షన్స్. ఈ పథకాలు మీ పెట్టుబడికి పూర్తి భద్రత కల్పించడంతో పాటు 7.5శాతం నుండి 8.2శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీని కూడా అందిస్తాయి. అంతేకాకుండా కొన్ని పథకాలకు పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి. అందుకే చాలా మంది పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

పోస్ట్ ఆఫీస్ అందించే ఆరు ముఖ్యమైన పొదుపు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్

మీరు 1, 2, 3 లేదా 5 సంవత్సరాల కాలానికి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.5శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. సురక్షితమైన పెట్టుబడి, స్థిరమైన రాబడి కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్

ఈ పథకం ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించబడింది. ఇందులో 2 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేటు 7.5శాతం కాగా రూ. 1,000 నుండి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం

5 సంవత్సరాల పెట్టుబడికి NSC ఒక మంచి మార్గం. ఈ పథకంపై ఏటా 7.7శాతం వడ్డీ లభిస్తుంది. ఇది చక్రవడ్డీ కాబట్టి మీ రాబడి ఏటా పెరుగుతూనే ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడికి పన్ను మినహాయింపు కూడా ఉంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిపై 8.2శాతం వడ్డీ రేటు ఉంటుంది. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం యొక్క ముఖ్య ప్రయోజనం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ తీసుకోవడం. ఇది సీనియర్ సిటిజన్లకు క్రమమైన ఆదాయాన్ని అందిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన

మీ కూతురి భవిష్యత్తు కోసం ఇది ఒక అద్భుతమైన పథకం. ఇందులో ఏడాదికి రూ. 250 నుండి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం 8.2శాతం వడ్డీని అందిస్తుంది. ఈ పథకం వ్యవధి 15 సంవత్సరాలు, 21 సంవత్సరాలకు పూర్తి అవుతుంది. ఇది మీ కూతురి చదువు, పెళ్లి కోసం ఒక బలమైన ఆర్థిక పునాదిని నిర్మిస్తుంది.

కిసాన్ వికాస్ పత్ర

మీ పెట్టుబడిని తక్కువ సమయంలో రెట్టింపు చేయాలనుకుంటే కిసాన్ వికాస్ పత్ర సరైనది. ఇందులో మీరు పెట్టిన మొత్తం 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకం 7.5శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కనీసం రూ. 1000తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు.

ఈ పోస్ట్ ఆఫీస్ పథకాలు స్థిరమైన, సురక్షితమైన రాబడిని కోరుకునే వారికి మంచి ఎంపికలుగా చెప్పవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు పథకం వివరాలు, నిబంధనలు పూర్తిగా తెలుసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..