Business: మీ బిల్డింగ్‌పై ఖాళీ స్థలం ఉందా.? డబ్బులే డబ్బులు..

|

Dec 31, 2023 | 9:15 AM

సాధారణంగా బిల్డింగ్‌పై ఉన్న స్థలాన్ని చాలా మంది నిరూపయోగంగానే ఉంచుతారు. మహా అయితే దుస్తులు ఆరేసుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగపడదు. అయితే తెలివిగా ఆలోచించాలే కానీ ఖాళీగా ఉండే ఆ స్థలంతో కూడా డబ్బులు ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయం పొందొచ్చు. పైగా ఇందుకోసం మీరు పూర్తి స్థాయిలో సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం కూడా లేదు...

Business: మీ బిల్డింగ్‌పై ఖాళీ స్థలం ఉందా.? డబ్బులే డబ్బులు..
Business Ideas
Follow us on

ఉద్యోగం చేస్తూనే వ్యాపారం చేసే వారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. పెరుగుతోన్న ఖర్చులకు అనుగుణంగా అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు పార్ట్‌ టైమ్‌గా వ్యాపారం చేస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలకు మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఓ మంచి బిజినెస్‌ ఆప్షన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా బిల్డింగ్‌పై ఉన్న స్థలాన్ని చాలా మంది నిరూపయోగంగానే ఉంచుతారు. మహా అయితే దుస్తులు ఆరేసుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగపడదు. అయితే తెలివిగా ఆలోచించాలే కానీ ఖాళీగా ఉండే ఆ స్థలంతో కూడా డబ్బులు ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయం పొందొచ్చు. పైగా ఇందుకోసం మీరు పూర్తి స్థాయిలో సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం కూడా లేదు. పార్ట్‌టైమ్‌గానే సంపాదించుకోవచ్చు. ఇంతకీ బిల్డింగ్‌ పై ఖాళీ స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే..

* ఇటీవల టెలికం సంస్థలు చిన్న చిన్న నగరాల్లో కూడా తమ సేవలను విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు ఊరు బయట ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన టవర్స్‌ను ఇప్పుడు బిల్డింగ్స్‌పైనే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇది బిల్డింగ్ ఉన్న వారికి మంచి ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది. మొబైల్ టవర్స్‌కు మీ టెర్రస్‌ను రెంట్‌కి ఇచ్చుకోవచ్చు. ఇందుకోసం అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా టెర్రస్‌ను రెంట్‌కి ఇవ్వడం ద్వారా నెలకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఆర్జించవచ్చు.

* ఇక టెర్రస్‌ ఫార్మింగ్‌కు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. మిద్దెపైనే కూరగాయలు, పండ్లు పండిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇలా ఇంటిపై ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు పండించుకోవడం ద్వారా ఇంట్లో అవసరాలు తీరడంతో పాటు బయట కూడా విక్రయించవచ్చు.

* ప్రస్తుతం సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు ట్రెండ్‌ నడుస్తోంది. టెర్రస్‌పై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు సైతం రాయితీలు అందిస్తున్నాయి. సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో అవసరాలకు కరెంట్‌ ఉత్పత్తి చేసుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను పలు సంస్థలకు విక్రయించుకోవడం ద్వారా ఆదాయం కూడా పొందొచ్చు.

* ఇక మీ బిల్డింగ్‌ కనుక ఒకవేళ రద్దీ ప్రదేశంలో ఉంటే హోర్డింగ్‌లు, బ్యానర్లకు ఉపయోగపడుతుంది. యాడ్‌ ఏజెన్సీలతో మాట్లాడుకొని టెర్రస్‌పై హోర్డింగ్స్‌ ఏర్పాటు చేసుకుంటే నెల నెలా మంచి ఆదాయం పొందొచ్చు. ఆదాయం మీ ఇల్లు ఉన్న ఏరియా, రద్దీపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..