Best Bikes: కొత్త బైకు కోసం చూస్తున్నారా? మార్కెట్లో చౌకైన బైక్స్ ఇవే

మీరు కొత్త బైక్ కోసం చూస్తున్నారా? అయితే మార్కెట్లో మీకు బోలెడు ఆప్షన్స్ కనిపిస్తాయి. కానీ, వాటిలో తక్కువ ధరకు మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ మాత్రం కొన్నే ఉన్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ బడ్జెట్ బైక్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

Best Bikes: కొత్త బైకు కోసం చూస్తున్నారా? మార్కెట్లో చౌకైన బైక్స్ ఇవే
Best Bikes

Updated on: Oct 02, 2025 | 4:47 PM

మనదేశంలో ఐఫోన్ కంటే తక్కువ ధరకే మంచి బైక్ కొనుగోలు చేయొచ్చు. పైగా జీయస్టీ 2.0 తర్వాత బైక్స్ ధరలు ఇంకా తగ్గాయి. కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైం. రూ. లక్ష లోపు బడ్జెట్ లో మంచి ఇంజిన్, మెరుగైన మైలైజ్ ఇచ్చే బైక్స్ మార్కెట్లో చాలానే ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

హీరో స్ప్లెండర్ ప్లస్

మనదేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే బైక్స్ లో హీరో స్ప్లెండర్ ఒకటి. ఇది స్లిమ్ సైజులో ఎలాంటి వారికైనా నడిపేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇది 97 సీసీ ఇంజిన్ తో వస్తుంది. ఇది 7.91 బీహెచ్ పీ పవర్, 8.05 ఎన్ ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. లీటర్ కి 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ధర రూ. 73,523

హోండా షైన్ 100

హోండా షైన్ కూడా ఇండియాస్ బెస్ట్ సెల్లింగ్ బైక్స్ లో ఒకటి.  హోండా షైన్ బండి.. 100 సీసీ ఇంజిన్ తో వస్తుంది. ఇది 7.38 హార్స్ పవర్, 8.04 ఎన్ ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ధర రూ. 63,191 ఉంటుంది. లీటర్ కి 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు.

బజాజ్ ప్లాటినా

ఇండియాలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ ఇదే. బజాజ్ ప్లాటినా బైక్ లో102 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 7.9 బీహెచ్ పీ పవర్,  8.3 ఎన్ ఎం టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. కంపెనీ చెప్తున్న దాని ప్రకారం ఇది లీటర్ కి 90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ధర రూ. 65,407 ఉంటుంది. టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్.. 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ తో వస్తుంది. ఇది 7.9 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బండి ధర రూ. 58,739 ఉంటుంది. ఇది లీటర్ కు 65 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు.

టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్

ఇది దేశంలోనే చౌకైన బైకు. దీని ధర రూ. 55,100 ఉంటుంది. ఈ బైక్ లో109.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.3 హార్స్ పవర్, 7.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. లీటర్ కు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి