Startup News: స్టార్టప్ లకు కేంద్ర బిందువుగా బెంగళూరు.. సింగపూర్, టోక్యోలను వెనక్కు నెట్టి..

|

Jun 15, 2022 | 2:47 PM

Startup News: గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో యువ ఆవిష్కరణలకు, వినూత్న వ్యాపారాలకు మంచి ప్రోత్సాహం లభిస్తోంది. కొత్త ఆలోచనలతో స్టార్టప్ కంపెనీలను ప్రారంభించే వారికి ప్రాధాన్యత పెరుగుతోంది.

Startup News: స్టార్టప్ లకు కేంద్ర బిందువుగా బెంగళూరు.. సింగపూర్, టోక్యోలను వెనక్కు నెట్టి..
Startup
Follow us on

Startup News: గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో యువ ఆవిష్కరణలకు, వినూత్న వ్యాపారాలకు మంచి ప్రోత్సాహం లభిస్తోంది. కొత్త ఆలోచనలతో స్టార్టప్ కంపెనీలను ప్రారంభించే వారికి ప్రాధాన్యత పెరుగుతోంది. వారికి అవసరమైన ఆర్థిక వనరులు సైతం దేశంలో అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇప్పుడు అవి అద్బుతాలను సృష్టిస్తున్నాయి.

బెంగళూరు టెక్ ఎకోసిస్టం విలువ 105 బిలియన్ డాలర్లుగా ఉందని మింట్ వార్తా సంస్థ ప్రచురించి ఒక కథనం ప్రకారం తెలుస్తోంది. ప్రపంచంలోని మరిన్ని దేశీలను పరిగణలోకి తీసుకుంటే.. సింగపూర్ 89 బిలియన్ డాలర్లు, టోక్యో 62 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ కలిగి ఉన్నాయి. అంతకుముందు బెంగుళూరు కూడా 2021లో వెంచర్ క్యాపిటల్ రైజ్, అనేక రౌండ్లలో బీజింగ్,  షాంఘైలను వెనక్కు నెట్టింది.

బెంగళూరు తన మార్కెట్ రీచ్‌లో గణనీయమైన లాభాలను పొందడం వల్ల గ్లోబల్ స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్‌లో 22వ ర్యాంక్ సాధించింది. ఈ జాబితాలో ఢిల్లీ 11 స్థానాలు పెరిగి 26వ ర్యాంక్ దక్కించుకోగా.. ముంబై 36వ స్థానంలో నిలిచింది. ఈ పరిశోధన లండన్, బెంగళూరు, యూరప్ తో పాటు ఆసియాలో ప్రముఖ స్టార్ట్-అప్ హబ్‌లు మాత్రమే కాకుండా ప్రపంచ వేదికపై కూడా పోటీపడుతున్నాయని రుజువు చేస్తుందని తెలిసింది.

బెంగళూరు కాకుండా ఇతర నగరాల్లోని వాణిజ్య స్థలాల విషయంలో అవసరమైన మార్పులు తీసుకురావడానికి ‘బియాండ్ బెంగళూరు’ మిషన్‌ను ప్రోత్సహించేందుకు కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్, బెంగళూరులో ఒక ఎంఓయూ గతంలోనే జరిగింది. బెంగళూరు-కర్ణాటక ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అపూర్వమైన వేగంతో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో స్టార్టప్ వ్యాపారాలను స్కేల్ అప్ చేసింది. ఇది పర్యావరణ వ్యవస్థ క్రమంగా అనేక యునికార్న్‌లకు పుట్టేందుకు కారణంగా నిలిచింది. ఇప్పుడు లాగరిథమిక్ వృద్ధికి సంకేతాలు ఇస్తోందని కర్ణాటక ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.