Market Closing Bell: రోజంతా ఊగిసలాటలో సూచీలు.. మార్కెట్ ను ప్రభావితం చేసిన మెటల్ స్టాక్స్.. చివరికి నష్టాల్లోనే..

Market Closing Bell: ఈ రోజు స్టాక్‌ మార్కెట్లు(Stock Market) స్వల్ప నష్టాలతో ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం ప్రధాన సూచీలైన నిఫ్టీ, సెనెక్స్ స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి.

Market Closing Bell: రోజంతా ఊగిసలాటలో సూచీలు.. మార్కెట్ ను ప్రభావితం చేసిన మెటల్ స్టాక్స్.. చివరికి నష్టాల్లోనే..
Stock Market

Updated on: May 23, 2022 | 5:26 PM

Market Closing Bell: ఈ రోజు స్టాక్‌ మార్కెట్లు(Stock Market) స్వల్ప నష్టాలతో ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం ప్రధాన సూచీలైన నిఫ్టీ, సెనెక్స్ స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సైతం లాభాల్లోనే మెుదలయ్యాయి. కానీ.. బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 16,200 పాయింట్ల వద్ద స్థిరపడింది. మెటల్ స్టాక్స్ పతనం కారణంగా సెన్సెక్స్ చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. వాహన, ఐటీ సెక్టార్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. మార్కెట్ ఈ రోజు స్వల్పంగా దిగువన ముగిసింది. మెటల్ సెక్టార్ లోని JSW స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో షేర్ల పతనం కారణంగా నిఫ్టీ మెటల్ దాదాపు 8 శాతం మేర పతనమైంది.

మార్నింగ్ ట్రేడ్‌లో మెటల్ ఇండెక్స్ దాదాపు 9% క్షీణించి 5,200 పాయింట్ల స్థాయిలకు పడిపోయింది. స్టీల్ ఉత్పత్తులపై విధించిన ఎగుమతి పన్ను తర్వాత కోలుకోలేక పోవడంతో మార్కెట్లు ఈరోజు మధ్యాహ్నం ట్రేడ్‌లో నష్టపోయాయని  LKP సెక్యూరిటీస్ వెల్లడించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వివాదం దాని పర్యవసానాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఇన్వెస్టర్లు, వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వ పాలసీ వార్తల నేపథ్యంలో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ భారీగా అమ్మకాలను చవిచూడాల్సి వచ్చింది.

వీటికి తోడు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఇంధనంపై పన్ను తగ్గింపుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అదనపు మార్కెట్ రుణాలను తీసుకునే అవకాశాలు కూడా తెరపైకి రావటం కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. దీంతో.. బెంచ్‌మార్క్‌ సూచీలైన నిఫ్టీ-50, సెన్సెక్స్ వరుసగా 0.3% , 0.07% దిగువన ముగిశాయి. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ వరుసగా 0.3%, 0.8% పడిపోయాయి. ఈ రోజు ఓలటైల్ మార్కెట్‌లో నిఫ్టీ ఆటో ఒకటిన్నర శాతానికి పైగా లాభపడటంతో ఆటో స్టాక్స్ పై ప్రభావం పడలేదు. ఆటోతో పాటు నిఫ్టీ ఐటీ కూడా ఒక శాతానికి పైగా లాభపడింది.

ఇవి కూడా చదవండి

మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టి, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ బెంచ్‌మార్క్‌లలో అత్యధికంగా లాభపడ్డాయి. ఇదే సమయంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, దివీస్ ల్యాబొరేటరీస్, హిందాల్కో, ఓఎన్‌జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లకు చెందిన షేర్లు నష్టపోయాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి