ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోండి.. లేదంటే తిప్పలు తప్పవు!

ఈ మధ్యకాలంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది మధ్య తరగతి కుటుంబాలు ఆ ఖర్చులను బరించలేక సరైన వైద్యాన్ని పొందలేక పోతున్నారు. ఇలా సందర్భాల్లో ఆరోగ్య బీమాలు చాలా మందిని ఆదుకుంటాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది జీవి లేదా ఆరోగ్య బీమాలను తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. కానీ ఇక్కడ చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏ కంపెనీ బీమాలను తీసుకుంటే ఉత్తమైన ఫలితాలు పొందుతామని.. కాబట్టి బీమా తీసుకునేప్పుడు మనం ఎలాంటి విషయాలను పరిశీలించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోండి.. లేదంటే తిప్పలు తప్పవు!
Health Insurance Tips

Updated on: Dec 06, 2025 | 4:29 PM

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి జీవత, ఆరోగ్య బీమాలు తీసుకుంటున్నారు. మీరు కూడా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లేదా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని అనుకుంటే కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేక పోతే మీరు ఎమర్జెన్సీ సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా.. ముందుగా తెలుసుకోవలసి విషయం ఏమిటంటే.. కంపెనీ తక్కువ ప్రమీయం ఇస్తుందని కాదు.. ఏ కంపెనీ ఎక్కువ క్లైమ్ రెషియోను కలిగి ఉంది.. అది ఎంత త్వరగా మన క్లైమ్స్‌ను సెటిల్‌మెంట్ చేస్తుందని. కాబట్టి మంచి బీమా కంపెనీని ఎలా ఎంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

బీమా కంపెనీని ఎంచుకునేప్పుడు తెలుసుకోవాల్సిన అంశాలు

క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో

ప్రస్తుతం మార్కెట్‌లో చాలా బీమా కంపెనీలు ఉన్నాయి. వాటిలో చాలా కంపెనీలు కస్లమర్లను ఆకర్షించేందుకు తక్కవ ప్రీమియంను ఆఫర్స్ చేస్తుంటాయి. కానీ తక్కువ ప్రీమియం ఉంది కదా అని మీరు ఆశపడితే పప్పులో కాలేసినట్టే. కాబట్టి మీరు ఏదైనా కంపెనీ నుంచి బీమా తీసుకోవాలనుకుంటే ఫష్ట్ ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను తెలుసుకోండి. మీరు బీమా తీసుకోవాలనుకునే కంపెనీ ఎంత శాతం క్లైమ్ సెటిల్మెంట్ అందిస్తోందో తెలుసుకోండి. ఉదాహరణకు, 98–99% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్న కంపెనీలను మీరు నమ్మవచ్చు. అంతకంటే తక్కవ రేషియో ఉన్న కంపెనీల్లో బీమా తీసుకొని వేష్ట్

తక్కువ ఫిర్యాదులు

అలాగే మీరు బీమా తీసుకోవాలనుకున్న కంపెనీ రేటింగ్‌ను కూడా చూడండి. ఆ కంపెనీపై కస్టమర్లు ఫిర్యాదులు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయండి. ఒక వేళ కంపెనీపై ఎక్కువ ఫిర్యాదులు ఉంటే దాన్ని అవైడ్ చేయండి. దాంతో పాటు మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ ఉన్న కంపెనీని ఎంచుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏ కంపెనీలో అయితే కస్టమర్లు తమ బీమాను తరచుగా పునరుద్ధరించుకుంటే, ఆ కంపెనీ మంచిదని గుర్తుంచుకోండి

కంపెనీ స్థిరత్వం

మీరు ఏదైనా కంపెనీ నుంచి బీమా తీసుకోవాలనుకుంటే మీరు ఆ కంపెనీ స్థిరత్వ నిష్పత్తిని చెక్‌ చేయడం చాలా ముఖ్యం. ఎందకంటే స్థిరత్వ నిష్పత్తి అనేది కంపెనీ కస్టమర్లకు అందించే సేవను తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ తన ప్రీమియంను సకాలంలో చెల్లిస్తూ.. తన పాలసీని ఎక్కువ కాలం అదే కంపెనీలో కొనసాగిస్తున్నాడంటే.. ఆ కంపెనీ వాళ్లకు సంతృప్తి నిచ్చే సేవలను అందిస్తుందని అర్థం. కాబట్టి కంపెనీని ఎంచుకునే ముందు ఇది తెలుసుకోండి

సాల్వెన్సీ రేషియో

IRDAI నిబంధనల ప్రకారం, ప్రతి బీమా కంపెనీ కనీస రుణ కవరేజ్ నిష్పత్తి 1.50 (150%) కలిగి ఉండాలి. అయితే, 2.00 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కంపెనీలు దీర్ఘకాలంలో సురక్షితమైనవి, మరింత స్థిరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నిష్పత్తి అనేది కంపెనీ కస్టమర్లకు సకాలంలో చెల్లింపులు చేస్తుందనే దానికి సూచిస్తుంది.

ఇవి కూడా తప్పక గుర్తుంచుకోండి

  • IRDAI వెబ్‌సైట్‌ నుంచి మీరు ఎంచుకునే కంపెనీ రేటింగ్ తెలుసుకోండి. అలాగే ఆ కంపెనీపై కస్టమర్ల ఫిర్యాదులను తనిఖీ చేయండి
  • ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సి విషయం.. ఏజెంట్ మాటలు నమ్మీ మాత్రం అస్సలు పాలసీని కొనుగోలు చేయవద్దు
  • పాలసీ నిబంధనలు, మినహాయింపులు, వేచి ఉండే కాలాన్ని జాగ్రత్తగా చదవండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.