Bank Holidays: వచ్చే నెలలో 14 రోజులు బ్యాంకులు పనిచేయవు.. పూర్తి జాబితా ఇదే..

|

Feb 26, 2024 | 4:50 PM

ఈ క్రమంలోనే తాజాగా మార్చి నెలకు సంబంధించిన సెలవులను వివరాలను ఆర్‌బీ ప్రకటించింది. మార్చి నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి నెల బ్యాంకు సెలవుల జాబితాలో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు కూడా ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి...

Bank Holidays: వచ్చే నెలలో 14 రోజులు బ్యాంకులు పనిచేయవు.. పూర్తి జాబితా ఇదే..
Bank Holidays
Follow us on

ప్రస్తుతం దేశంలో బ్యాంకింగ్‌ సేవల విస్తృతి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్యాంకు సేవలు అందుబాటులోకి రావడం, ప్రభుత్వాలు సైతం పథకాలకు సంబంధించిన నగదును నేరుగా బ్యాంకుల్లోకి జమ చేయడంతో ఖాతాలు తెరవడం అనివార్యంగా మారింది. దీంతో బ్యాంకుల పనివేళలపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. ఈ క్రమంలోనే ప్రతీ నెల బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేయవన్న విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా మార్చి నెలకు సంబంధించిన సెలవులను వివరాలను ఆర్‌బీ ప్రకటించింది. మార్చి నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి నెల బ్యాంకు సెలవుల జాబితాలో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు కూడా ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఈ సెలవుల్లో కొన్ని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుండగా, కొన్ని సెలవులు మాత్రం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. ఇంతకీ వచ్చే నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేయవో ఇప్పుడు తెలుసుకుందాం..

* మార్చి 1వ తేదీన చప్చర్ కుట్ వేడుక సందర్భంగా మిజోరాంలో బ్యాంకులు పనిచేయవు.

* ఇక మార్చి 3వ తేదీ ఆదివారం సెలవు ఉంటుంది.

* మార్చి 8వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.

* మార్చి 09వ తేదీన రెండవ శనివారం సందర్భంగా అన్ని చోట్ల బ్యాంకులు బంద్‌.

* ఇక మార్చి 10వ తేదీన ఆదివారం దేశంలోని అన్ని చోట్ల బ్యాంకులు సెలవు.

* మార్చిన 17వ తేదీ ఆదివారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.

* ఇక మార్చి 22వ తేదీన బీహార్ దివస్ సందర్భంగా బీహార్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు.

* మార్చిన 23వ తేదీన నాల్గవ శనివారం సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.

* ఇక మార్చి 24వ తేదీన ఆదివారం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.

* మార్చి 25వ తేదీన హోలీ వేడుక సందర్భంగా దేశంలోని చాలా చోట్ల బ్యాంకులు పనిచేయవు.

* ఇక మార్చి 26వ తేదీన హోలీ సందర్భంగా ఒడిస్సా, మణిపూర్ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.

* ఇక బిహార్‌లో హోలీ వేడుకను పురస్కరించుకొని మార్చి 27వ తేదీన బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

* మార్చి 29వ తేదీన గుడ్‌ ఫ్రైడే సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.

* మార్చి 31వ తేదీన ఆదివారం అన్ని చోట్ల బ్యాంకులు పనిచేయవు.

ఇదిలా ఉంటే.. సెలవు దినాలలో బ్యాంకులు మూతపడినప్పటికీ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్ లైన్ సర్వీసులు మాత్రం యధావిధిగా పని చేస్తాయి. దీంతో పాటు బ్యాంకులకు చెందిన ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషిన్స్ యధావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..