కొత్త సంవత్సరం 2023లోకి అడుగుపెట్టేశాం. అప్పుడే జనవరి నెల కూడా ముగింపునకు వచ్చేసింది. ఫిబ్రవరిలోకి అడుగుపెట్టబోతున్నాం కూడా. మరి మనలో ఎంతోమంది నిత్యం ఆర్ధిక లావాదేవీల నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. వారందరికీ ఇదొక అలెర్ట్. మీకు వచ్చే నెలలో ఏమైనా బ్యాంకులకు వెళ్లి చేయాల్సిన పనులు ఉన్నట్లయితే.. గుర్తించుకోండి.! ఫిబ్రవరిలో ఏకంగా 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ సెలవులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతాయి. ఇందులో మహాశివరాత్రి లాంటి పండుగలతో పాటు రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. మరి ఆ లిస్టు ఏంటో తెలుసుకుందామా.?
ఫిబ్రవరి 5 – ఆదివారం
ఫిబ్రవరి 11 – రెండో శనివారం
ఫిబ్రవరి 12 – ఆదివారం
ఫిబ్రవరి 15 – లుఇ-నగై-ని పండుగ(మణిపాల్)
ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
ఫిబ్రవరి 19 – ఆదివారం
ఫిబ్రవరి 20 – మిజోరం రాష్ట్ర దినోత్సవం
ఫిబ్రవరి 21 – లోసార్ పండుగ
ఫిబ్రవరి 25 – నాలుగో శనివారం
ఫిబ్రవరి 26 – ఆదివారం