PM Jan Dhan Yojana: దేశంలో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ 2014 సంవత్సరంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించారు. దీనికింద లబ్దిదారులకు జీరో బ్యాలెన్స్ అకౌంట్, విత్ ఏటీఎమ్ కార్డ్.. 2 లక్షల ఇన్స్‌రెన్స్ కల్పించారు. ఈ పథకం కింద లబ్దిదారులు పోస్టాఫీసులు, ప్రభుత్వ, పైవేట్ బ్యాంకులలో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు. ఇందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయవలసిన అవసరం లేదు. అంతేకాదు జన్ ధన్ యోజన ఖాతాలను ప్రభుత్వ పథకాలకు లింక్ చేసి లబ్ధిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నారు.
జన్‌ధన్ ఖాతాల ద్వారా లబ్ధిదారులు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన 6 నెలల తర్వాత 10,000వేల ఓవర్ డ్రాప్ట్ సౌకర్యాన్ని పొందవచ్చు. 2 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. జన్‌ధన్ ఖాతాదారుడికి 30,000వేల వరకు జీవిత బీమా కవరేజ్ కానీ ఇది కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. ఇందులో చేసే డిపాజిట్లపై వడ్డీ కూడా లభిస్తుంది. ఖాతాదారుడికి ఉచిత మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పిస్తారు. దీని ద్వారా లావాదేవీల వివరాలను తెలుసుకోవచ్చు.
జన్ ధన్ ఖాతా కింద లబ్ధిదారులకు రూపే డెబిట్ కార్డు అందజేస్తారు. దీంతో ఎప్పుడైనా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. పింఛన్ పొందేవారు జన్‌ధన్ ఖాతాలను ఉపయోగించుకోవచ్చు. నేరుగా పింఛన్ డబ్బులు ఈ అకౌంట్‌లో జమవుతాయి. పీఎం కిసాన్, శ్రమయోగి మాన్‌ధాన్ యోజన డబ్బుల కోసం ఈ ఖాతాని ఉపయోగించుకోవచ్చు. నేరుగా డబ్బులు ఖాతాలో జమవుతాయి. జన్‌ధన్ ఖాతాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY) పథకాలకి అర్హులు అవుతారు.