
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. బ్యాంక్ లాకర్లకు సంబందించి కీలక వ్యాఖ్యలు చేశారు. కస్టమర్లు లాకర్లలో దాచుకునే వస్తువులను బ్యాంకులు చూడలేవని, వాటిని నమోదు చేయలేవని అన్నారు. బ్యాంకు లాకర్లలోని వస్తువులను చూడటం నిబంధనలకు వ్యతిరేకమన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్బంగా నిర్మలా సీతారామన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు, కాంగ్రెస్ ఎంపీ నామ్ దేవ్ దాసరామ్ కిర్సన్ అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. బ్యాంకు లాకర్లలోని వస్తువుల ఆధారంగా వేర్వేరు బీమా కవరేజీ కల్పించే అవకాశం లేదని, ఏదైనా నష్టం జరిగినప్పుడు కస్టమర్లకు ప్రామాణిక కవరేజీ ఉంటుందని స్పష్టం చేశారు.
లాకర్లలోని వస్తువుల ఆధారంగా వేర్వేరు బీమా కవరేజీ లాకర్ల హోల్డర్లకు ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లాకర్లలో ఏ వస్తువులను ఉంచబోతున్నాడో వెల్లడించడాన్ని బ్యాంకింగ్ నిబంధనలను విరుద్దమని, బ్యాంకులు అలా చేయవన్నారు. వేర్వేరు కవరేరజీ ఉండాలా.. వద్దా అని నిర్ణయించడానికి అది కొలమానం కాదన్నారు. లాకర్లకు నష్టం జరిగినప్పుడు ప్రమాణిక కవరేజీ వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లుగా ఉంటుందన్నారు. లాకర్లలోని వస్తువుల వాస్తవ విలువ ఆధారంగా బీమా కవరేరజ్ అందంచడం సాధ్యం కాదని, ప్రతీ ఒక్క కస్టమర్లకు విడివిడిగా అమలు చేయడం సాద్యం కాదని తెలిపారు. లాకర్ పగిలిపోవడం, ఇతర నష్టాలు జరిగితే 100 రెట్ల పరిహారం అందుతుందని, ప్రస్తుతానికి ఇతర పరిశీలన లేదని ఆమె పేర్కొన్నారు,.