Customers Alert: పండగ సీజన్‌కు ముందు పలు బ్యాంకులు వినియోగదారులకు పలు ఆఫర్లు ఇస్తుంటాయి. బ్యాంకులోన్స్, వివిధ వాటిలో ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా బంపర్ ఆఫర్‌లు ఇస్తుంటాయి. అలాగే తాజాగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. బంగారం, హౌసింగ్ లోన్స్ వంటి రుణాలపై విధించే ప్రాసెసింగ్ ఫీజులను తొలగించాలని నిర్ణయించింది. అయితే మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి రుణం తీసుకుఓవాలనుకుంటే ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తుంది. దీంతో వేలాది రూపాయలు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
అయితే రుణం తీసుకున్న సమయంలో అనేక ఖర్చులు ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు అని, ఇందులో వడ్డీ చెల్లింపు ప్రాసెసింగ్ ఫీజులు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, ప్రీపేమెంట్ పెనాల్టీ ఛార్జీలు, ఇతర ఛార్జీలు ఉంటాయి. పండగ సీజన్‌లో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు అందించాలనే ఉద్దేశంతో బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇలాంటి సేవలకు ఎలాంటి ఛార్జీలు లేకుండా వచ్చే నెల 30 వరకు పొందవచ్చు.
బ్యాంకు జారీ చేసిన ప్రకనటలో గృహ రుణంపై 6.90 శాతం వడ్డీ రేటుతో తీసుకోవచ్చు. అదే సమయంలో కారు రుణాలకు వడ్డీ రేటు 7.30 శాతంగా నిర్ణయించింది బ్యాంకు. బంగారు రుణ పథకంలో మార్పులు చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.20 లక్షల వరకు బంగారు రుణాలపై వడ్డీ రేట్లు 7.10 శాతం. అదే సమయంలో రూ. లక్ష వరకు బంగారు రుణాల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
బ్యాంకు జారీ చేసిన ప్రకటనలో గృహ రుణంపై రెగ్యులర్‌గా ఈఎంఐ చెల్లించే వారు రెండు ఈఎంఐలపై డిస్కౌంట్ పొందవచ్చు. ఇది కాకుండా ఖాతాలు మూసివేత ఛార్జీలు వంటివి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. మీరు రెండేళ్ల కిందట రూ.5 లక్షల కార్ల రుణం తీసుకుని, ఇప్పుడు మీరు రుణం ఇచ్చే బ్యాంకుకు ఒక లక్ష మొత్తం చెల్లించి మీ రుణ వ్యవధి లేదా నెలవారీ వాయిదాల మొత్తాన్ని తగ్గించుకుంటే దానిని ప్రీపేమెంట్ అంటారు. నిర్ణీత వ్యవధిలో రుణాన్ని మూసివేత లేదా తిరిగి చెల్లించే ప్రక్రియలో మీరు మొత్తం బ్యాంకుకు చెల్లిస్తుంటారు. ఈ సమయంలో మీ రుణంపై విధించే పలు ఛార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.