Bank Of Baroda: ప్రస్తుతం కరోనా కాలంలో ఏదైనా పనిమీద బయటకు వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ వేవ్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో చాలా మంది ఇళ్ళకే పరిమితమైపోతున్నారు. ఇక పలు సంస్థలు తిరిగి వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అవలంభిస్తున్నాయి. కానీ మన డబ్బులు, అకౌంట్ సంబంధిత విషయాలకు మాత్రం కచ్చితంగా అడుగు బయటపెట్టాల్సిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. తమ వినియోగదారులకు ఆన్ లైన్ ద్వారా సేవలను అందించడానికి కసరత్తులు చేస్తోంది. తమ వినియోగదారుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులు ఇంట్లో ఉండే బ్యాంక్ సేవలను అందుకునే విధంగా పలు మార్పులు చేసింది.
ఫిక్స్డ్ అమౌంట్ జమ చేయాలనుకునే కస్టమర్ల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా అప్లికేషన్ ప్రాసెస్ ను సులభతరం చేసింది. అంటే BOBలో ఫిక్స్ డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారు అందుకోసం బ్యాంకుకు వెళ్ళాల్సిన పనిలేదు. కేవలం 5 నిమిషాల్లో మీ ఇంట్లో ఉండే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందామా.
బ్యాంక్ అప్లికేషన్ ద్వారా ఫీక్స్ డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ” ఇందుకోసం బ్యాంక్ వరకు వెళ్ళాల్సిన పనిలేదు. మేము బ్యాంక్ ఆఫ్ బరోడా మీ సౌలభ్యం గురించి ముందుగా ఆలోచిస్తాం ” అంటూ ట్వీట్ చేసింది. BarodaMConnectPlus ని డౌన్‌లోడ్ చేసుకోని.. ఇంటి నుంచే ఎఫ్ డీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
ట్వీట్..
We at #BankofBaroda think of your convenience first. Download #BarodaMConnectPlus app now & open a Fixed Deposit account right from the comfort of your home. Download now https://t.co/OTAWhnfSB8 pic.twitter.com/JAeTjCPJ6Y
— Bank of Baroda (@bankofbaroda) April 18, 2021
ముందుగా గూగుల ప్లే స్టోర్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్లో ఈ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ చేసిన తర్వాత ఖాతా ద్వారా సులభంగా ఓపెన్ అవుతుంది.
15G, 15H ఫారంలను సమర్పించాలంటే.. ముందుగాల లాంగ్ లైన్లను సమర్పించాల్సిన అవసరం లేదని బ్యాంక్ ఆఫ్ బరోడ ట్వీట్ చేసింది. ఇంట్లో ఉండే ఎఫ్ డీ జమ చేయ్యోచ్చు. ఇందుకోసం BarodaMConnectPlus ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ సేవలను వినియోగించుకోవాలంటే.. ముందుగా భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే మీ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల రూపాయల కన్నా తక్కువ ఉండాలి. అదే సమయంలో 15H ఫారాలను భారతీయ పౌరులు, 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారు నింపవచ్చు.
Also Read: Ayushman Card: ఫ్రీగా ఆయుష్మాన్ కార్డు.. తీసుకున్నవారికి రూ.5 లక్షల బెనిఫిట్.. ఆ తేదీ వరకే ఛాన్స్..
మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్మెంట్కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే..