Bank Of Baroda: ‘పచ్చదనం’ భూమికే కాదు మీ నెట్‌ బ్యాంకింగ్‌కు అవసరమంటోన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఇంతకీ ఏంటా పచ్చదనం..

Bank Of Baroda Tweet: టెక్నాలజీ పెరగడంతో అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి. అలాంటి వాటిలో బ్యాంకింగ్‌ రంగం ప్రధానమైంది. ఒకప్పుడు ఎవరైనా అకౌంట్‌లో డబ్బులు వేయాలంటే బ్యాంకుకు వెళ్లి, డిపాజిట్‌ ఫామ్‌ రాసి, లైన్‌లో నిల్చొని, అకౌంట్‌లో డబ్బులు వేయాలి.. ఇలా...

Bank Of Baroda: పచ్చదనం భూమికే కాదు మీ నెట్‌ బ్యాంకింగ్‌కు అవసరమంటోన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఇంతకీ ఏంటా పచ్చదనం..
Bank Of Baroda

Updated on: Apr 04, 2021 | 8:33 PM

Bank Of Baroda Tweet: టెక్నాలజీ పెరగడంతో అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి. అలాంటి వాటిలో బ్యాంకింగ్‌ రంగం ప్రధానమైంది. ఒకప్పుడు ఎవరైనా అకౌంట్‌లో డబ్బులు వేయాలంటే బ్యాంకుకు వెళ్లి, డిపాజిట్‌ ఫామ్‌ రాసి, లైన్‌లో నిల్చొని, అకౌంట్‌లో డబ్బులు వేయాలి.. ఇలా పెద్ద తతంగం ఉండేది. కానీ ఇప్పుడు జస్ట్‌ ఒక క్లిక్‌తో మీ అకౌంట్‌లోని డబ్బులను ఎవరికి కావాలంటే వారికి పంపించేస్తున్నారు. అందులోనూ అన్ని బ్యాంకులు ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడం, యాప్స్‌ కూడా ఉండడంతో ఈ పని మరింత సులువుగా మారింది.
అయితే పని సులువైందని సంతోషించాలో.. సైబర్‌ నేరగాళ్ల హవా పెరిందని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నెట్‌ బ్యాంకింగ్ అందుబాటులోకి రావడంతో పాస్‌వర్ట్‌లను బ్రేక్‌ చేస్తూ కొందరు సైబర్‌ నేరగాళ్లు మన ఖాతాలోని డబ్బులను కొట్టేస్తున్నారు. ఇందులో భాగంగానే నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లను చాలా స్ట్రాంగ్‌గా ఉండేలా సెట్‌ చేసుకోవాలని సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే పలు బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని కల్పిస్తూ వినియోగదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాయి. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన కస్టమర్లకు పాస్‌వర్డ్‌ విషయమై ఓ సూచన చేసింది. అయితే ఆ బ్యాంక్‌ ఇందుకోసం కాస్త వెరైటీగా ఆలోచింది. సాధారణంగా పాస్‌వర్డ్ సెట్‌ చేసుకునే సమయంలో రెడ్‌ కలర్‌ (వీక్‌), యెల్లో కలర్‌ (యావరేజ్), గ్రీన్‌ (స్ట్రాంగ్‌) కలర్స్‌ను చూపిస్తుంది. అంటే పాస్‌వర్డ్ క్రియేట్‌ చేసుకునే సమయంలో గ్రీన్‌ కలర్‌ వచ్చేలా చూసుకోవాలని దాని ఉద్దేశం. ఇదే విషయాన్ని తెలుపుతూ… ‘ఆకుపచ్చ రంగు కేవలం భూమిని మాత్రమే కాపడకుండా (చెట్లు పర్యావరణానికి మేలే చేస్తాయని అర్థం) మీ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌కు కూడా ఉపయోగపడుతుంది. పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకునే సమయంలో అప్పర్‌ లెటర్స్‌, లోవర్‌ లెటర్స్‌, స్పెషల్‌ క్యారెక్టర్స్‌, నెంబర్లను ఉపయోగించండి’ అంటూ కస్టమర్లకు సూచించింది. ఈ విషయాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసింది. బ్యాంకు ఆలోచన భలే ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చేసిన ట్వీట్‌..

Also Read: చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడిపై కేంద్రం సీరియస్.. మావోలను ఉక్కుపాదంతో అణచివేస్తామని అమిత్‌షా హెచ్చరిక

Natasa Asking Fans: సరదాగా ఈ ఫోటోకు ఓ కామెంట్ పెట్టండి ప్లీజ్.. ఫ్యాన్స్‌ కోరిన హార్దిక్ భార్య నటాషా..

AP Crime News: ఇంట్లో దిమ్మతిరిగే సెటప్.. పుస్తకాలకు అట్టలేసినట్టు అలవోకగా నకిలీ కరెన్సీ తయారీ