విద్యార్థులకు ఇది నిజాంగానే తీపికబురు అని చెప్పుకోవచ్చు. ఉన్నత చదువులు చదివాలనుకునే వారికి తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవచ్చు. పలు బ్యాంకులు తక్కువ వడ్డీకి స్టూడెంట్స్ కోసం రుణాలు అందిస్తున్నాయి. అయితే విద్యార్థులకు తక్కువ వడ్డీకి ఎడ్యూకేషన్ లోన్స్ అందిస్తున్న బ్యాంకులు ఏవో తెలుసుకుందామా.
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda ) విద్యార్థుల కోసం తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్ అందిస్తోంది. ఈ బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్స్‌పై వడ్డీ రేటు 6.75 శాతం నుంచి ప్రారంభమౌతోంది. దీని తర్వాతి స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Union Bank Of India), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) వంటి బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నాయి. విద్యా రుణాలపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.8 శాతం వడ్డీ రేటు పడుతుంది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే 6.85 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ కోసం లోన్ తీసుకునే వారికి పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న తర్వాత చెల్లించే వడ్డీ మొత్తం పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేవారికి రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి. విదేశాల్లో ఉన్నత విద్యలు చదువాలనుకునే విద్యర్థులు ఈ ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. Education Loans