
భారతదేశంలోని అనేక బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో మహిళల కోసం ప్రత్యేక పథకాలను అందిస్తున్నాయి. ఈ పథకాలు మహిళా రుణగ్రహీతలకు అనేక రకాల ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను అందిస్తాయి. ముఖ్యంగా వారి లక్ష్యాలు, ఆకాంక్షలను సాధించేందుకు వీలు కల్పిస్తాయి. అయితే ఇన్ని పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రపంచ బ్యాంకు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2020 నివేదిక వెల్లడించిన ప్రకారం భారతదేశంలోని 17 శాతం మహిళలు మాత్రమే ఈ ప్రత్యేక రుణాల గురించి తెలుసని పేర్కొంది. ముఖ్యంగా మహిళలు తాము పొందగల ఆర్థిక ప్రయోజనాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మహిళలకు అందించే కొన్ని పథకాలను పరిశీలిద్దాం.
ఎన్‌బీఎఫ్‌సీలు అందించే వడ్డీ రేట్లు రుణ కాల వ్యవధి, ఆదాయ స్థాయి, క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం మరియు ఇతర ప్రమాణాల ఆధారంగా మారవచ్చు. కొన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఒంటరి మహిళా రుణగ్రహీతలు లేదా వ్యాపారవేత్తల కోసం వ్యాపార రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు వంటి ప్రత్యేక పథకాలను కూడా అందిస్తాయి. రుణగ్రహీతలు రుణంపై నిర్ణయం తీసుకునే ముందు వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అందించే నిబంధనలను వివరంగా పరిశీలించాలి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు, పన్ను రాయితీల విషయంలో కూడా ప్రభుత్వం మహిళలకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.
మహిళలు తమ ఆర్థిక స్వాతంత్య్రం సాధించేందుకు అనేక ప్రత్యేక పథకాలు ఉన్నాయి. కానీ, ఏదైనా రుణం తీసుకునే ముందు, రుణగ్రహీతలు తప్పనిసరిగా నియమ నిబంధనల తెలసుకుని రుణం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి