Bank Loan: ఈ రెండు బ్యాంకుల కస్టమర్లకు షాక్‌.. ఇక నుంచి రుణాలు మరింత కాస్లీ.. ఎందుకంటే..!

|

Sep 11, 2022 | 1:11 PM

Bank Loan: బ్యాంకులు కస్టమర్లకు షాకిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెంచడం, ఈఎంఐలు పెరగడం వల్ల వినియోగదారులకు మరింత భారం పడుతుంది. ఇప్పటికే చాలా బ్యాంకులు..

Bank Loan: ఈ రెండు బ్యాంకుల కస్టమర్లకు షాక్‌.. ఇక నుంచి రుణాలు మరింత కాస్లీ.. ఎందుకంటే..!
Bank Loan
Follow us on

Bank Loan: బ్యాంకులు కస్టమర్లకు షాకిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెంచడం, ఈఎంఐలు పెరగడం వల్ల వినియోగదారులకు మరింత భారం పడుతుంది. ఇప్పటికే చాలా బ్యాంకులు వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచగా, తాజాగా దేశంలోని రెండు పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను పెంచాలని నిర్ణయించుకున్నాయి. ఈ బ్యాంకులు.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి. దీని వల్ల రెండు బ్యాంకుల ఖాతాదారులపై గృహ రుణం, వాహన రుణం, వ్యక్తిగత రుణం, విద్యా రుణాల భారం పెరుగుతుంది.

రెండు బ్యాంకులు తమ MCLR రేటును 0.10% పెంచాయి. కొత్త రేట్లు 10 సెప్టెంబర్ 2022 నుండి అమలులోకి వచ్చాయి. ప్రతి రుణానికి ఈ పెంపు వర్తిస్తుందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ MCLR వడ్డీ రేట్ల పెంపు తర్వాత కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త MCLR రేటు: బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన MCLR రేటును పెంచడానికి నిర్ణయం తీసుకున్నప్పటి నుండి బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR 7% నుండి 7.50%కి పెరిగింది. అదే సమయంలో 3 నెలల MCLR రేటు 7.40% నుండి 7.50%కి పెరిగింది. అదే సమయంలో 6 నెలల MCLR రేటు 7.65% గా మారింది. అదే సమయంలో బ్యాంకు MCLR 1 సంవత్సరం రుణ కాలవ్యవధిపై 7.70% నుండి 7.80%కి పెరిగింది.

ఇవి కూడా చదవండి

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కొత్త MCLR రేటు: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించి MCLR రేటు కూడా 10% పెరిగింది. బ్యాంకు ఒక రోజు MCLR 7.05% నుండి 7.15%కి పెరిగింది. అదే సమయంలో 6 నెలల MCLR 7.60% నుండి 7.70%కి పెరిగింది. అదే సమయంలో MCLR 7.65% బదులుగా 7.75% వడ్డీ రేటు పెరిగింది. ఒక సంవత్సరం రుణంపై నుంచి ఈ రేటు ఉంటుంది. అదే సమయంలో 2, 3 సంవత్సరాల కాలానికి MCLR 7.70% నుండి 7.80%కి పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి