AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: మార్చి 13 నుంచి 16 వరకు బ్యాంకులకు వరుస సెలవులు.. ఎందుకో తెలుసా?

Bank Holidays: బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లేవారు బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి. వరుస సెలవులు ఏయే రాష్ట్రాల్లో ఉంటాయో తెలుసుకుందాం..

Bank Holidays: మార్చి 13 నుంచి 16 వరకు బ్యాంకులకు వరుస సెలవులు.. ఎందుకో తెలుసా?
Subhash Goud
| Edited By: TV9 Telugu|

Updated on: Mar 13, 2025 | 11:02 AM

Share

హోలీ పండుగ, రెండవ శనివారం కారణంగా బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూసి ఉండనున్నాయి. మార్చి 13 నుండి 16వ తేదీ వరకు వరుసగా బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ముఖ్యంగా బ్యాంకు సెలవులు బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు రాష్ట్రాన్ని బట్టి ప్రభుత్వ సెలవులతో తేడా ఉండవచ్చు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితాను నిర్ణయిస్తుంది. మీరు ఆర్థిక లావాదేవీలు నిర్వహించబోతున్నట్లయితే బ్యాంకులకు ఉండే సెలవుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

  1. మార్చి 13: మార్చి 13న హోలికా దహన్/అట్టుకల్ పొంగళ కారణంగా బ్యాంకులకు సెలవు. డెహ్రాడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ, తిరువనంతపురం వంటి నగరాల్లో శాఖలు మూసి ఉంటాయి.
  2. మార్చి 14: రంగుల పండుగ హోలీ వేడుకల కారణంగా మార్చి 14న చాలా నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. బ్యాంకులు మూసివేయబడే నగరాల్లో అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, గౌహతి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్ ఉన్నాయి.
  3. మార్చి 15: మార్చి 15 రెండవ శనివారం. పైన పేర్కొన్న బ్యాంకు సెలవులతో పాటు ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఐదు శనివారాలు ఉన్న నెలలోని ఐదవ శనివారం బ్యాంకులకు పని దినం. గతంలో బ్యాంకులు శనివారాల్లో సగం రోజు మాత్రమే తెరిచి ఉండేవి.
  4. మార్చి 16: భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు అన్ని ఆదివారాలు బ్యాంకు సెలవులు. భారతదేశంలో 2025 లో బ్యాంకు సెలవులు రాష్ట్రం నుండి రాష్ట్రానికి, నగరం నుండి నగరానికి మారుతూ ఉంటాయి. అయితే 2025 సంవత్సరంలో దేశవ్యాప్తంగా వర్తించే అనేక ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్లో కొన్ని గణతంత్ర దినోత్సవం (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) ఉన్నాయి. వీటితో పాటు దీపావళి, దసరా, క్రిస్మస్, ఈద్, గురునానక్ జయంతి, గుడ్ ఫ్రైడే, గణేష్ చతుర్థి, బుద్ధ పూర్ణిమ వంటి ముఖ్యమైన మతపరమైన పండుగ సెలవులు కూడా ఉన్నాయి.

హోలీని సంస్కృతంలో హోలిక దహన్ అని అనువదిస్తుంటారు. ఇది ఒక హిందూ పండుగ. దీనిలో హోలిక అనే రాక్షసిని దహనం చేయడానికి భోగి మంటలు వెలిగిస్తారు. ఈ ఆచారం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఇది వసంత ఋతువును జరుపుకునే రంగుల పండుగ అయిన హోలీకి ముందు జరుగుతుంది.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌