ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేస్తుంటుంది. వినియోగదారులు ఈ సెలవులను గమనించి తమతమ బ్యాంకు పనులను చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకుంటే మీ సమయం వృధా కావడంతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్‌లో మొత్తం 14 సెలవులు ఉండనున్నాయి. ఇందులో శని, ఆదివారాలు సెలవులు ఉన్నాయి. వినాయక చతుర్థి, ఈద్ మిలాద్ పండుగలు కూడా సెలవు జాబితాలో చేర్చారు. కేరళలో జరుపుకొనే ఓనం, తిరువణం పండుగలు ఉండనున్నాయి. బదులుగా నారాయణగురు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 18, 21 తేదీలలో కేరళలో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
సెప్టెంబరు 14 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకులకు మూడు రోజుల సెలవులు ఉంటాయి. ఇందులో 16న ఈద్ మిలాద్ కూడా ఉంది. సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు రాజస్థాన్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి. సిక్కింలో 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజుల సెలవులు ఉన్నాయి.ఈద్ మిలాద్ కాకుండా శని, ఆదివారాలు మాత్రమే సెలవులు. కర్ణాటకలో మొత్తం ఎనిమిది సెలవులు ఉన్నాయి.
సెప్టెంబర్ 2024లో బ్యాంక్ సెలవుల జాబితా
అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గమనించండి. ఇక తెలుగు రాష్ట్రాలకు ఉండే సెలవులను బట్టి బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి