Bank Holidays November 2021: బ్యాంకు కస్టమర్లు అలర్ట్‌.. నవంబర్‌ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..

|

Nov 01, 2021 | 5:53 AM

Bank Holidays November 2021: బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన లావాదేవీల విషయాలలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది. ప్రతి రోజు వివిధ రకాల..

Bank Holidays November 2021: బ్యాంకు కస్టమర్లు అలర్ట్‌.. నవంబర్‌ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..
Follow us on

Bank Holidays November 2021: బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన లావాదేవీల విషయాలలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది. ప్రతి రోజు వివిధ రకాల బ్యాంకు లావాదేవీలను నిర్వహిస్తుంటారు. అయితే బ్యాంకులకు ఉండే సెలవుల గురించి ముందే తెలుసుకుంటే సమయం వృథా కాకుండా ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్‌ నెల ముగిసింది. ఇక నవంబర్‌ నెల ప్రారంభమైంది. చాలా మంది బ్యాంకుల గురించి తెలుసుకుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా బ్యాంకు సెలవుల గురించి ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అయితే నవంబర్ లో బ్యాంకుల సెలవుల గురించి కూడా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్‌ అవుతోంది. నవంబర్ 17 రోజులపాటు బ్యాంకులు పనిచేయవన్నది ఈ పోస్టు సారాంశం. అయితే 17 రోజుపాటు బ్యాంకులు పనిచేయని మాట వాస్తవమే.. కానీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కలుపుకొని ఈ సెలువులు ఉన్నాయి. అయితే వచ్చేనెలలో కన్నడ రాజ్యజోత్సవం, ఛత్‌ పూజా వంటి పండుగలు ఉన్నాయి. వీటికి కర్ణాటకలో మాత్రమే హాలీడే ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు యధావిధిగా పని చేస్తుంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో..
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. దీపావళి, గురునానక్‌ జయంతి/ కార్తిక పూర్ణిమ సందర్భంగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. సాధారణ సెలవులు (శని, ఆదివారాలు)తో కలుపుకొని మొత్తంగా 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి ఆయా తేదీలను బట్టి మీ బ్యాంకు పనుల కోసం ముందుగానే ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌.

నవంబర్‌ 4 దీపావళి, 7వ తేదీ ఆదివారం, 13వ తేదీ రెండో శనివారం, 14న ఆదివారం, 19న గురునానక్‌ జయంతి, కార్తిక పూర్ణిమ, 27న నాలుగో శనివారం, 28 ఆదివారం రోజుల్లో బ్యాంకులు పని చేయవు. వీటిని దృష్టిలో ఉంచుకుని బ్యాంకుకు సంబంధించిన పనుల విషయాలలో ప్లాన్‌ చేసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

November: కస్టమర్లకు అలర్ట్‌.. నవంబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే..

Tesla Car: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. రోడ్డుపై చక్కర్లు కొడుతున్న టెస్లా ఎలక్ట్రిక్‌ కారు.. మార్కెట్లో సందడి చేయనున్న వాహనాలు

Post Office Franchise: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ బెనిఫిట్‌..