Bank Holidays in June 2022: ఖాతాదారులకు ముఖ్య అలెర్ట్.. జూన్‌లో బ్యాంకుల సెలవులు ఇవే!

Bank Holidays in Telangana and Andhra in June: మీకు వచ్చే నెలలో బ్యాంక్‌కి వెళ్లి చేయాల్సిన లావాదేవీలు ఏమైనా ఉన్నాయా.? లేదా బ్యాంక్‌కు వెళ్లే అవసరం ఉందా.? అయితే ఈ ముఖ్యమైన అలెర్ట్..

Bank Holidays in June 2022: ఖాతాదారులకు ముఖ్య అలెర్ట్.. జూన్‌లో బ్యాంకుల సెలవులు ఇవే!
Bank Holidays

Updated on: May 27, 2022 | 10:41 AM

మీకు వచ్చే నెలలో బ్యాంక్‌కి వెళ్లి చేయాల్సిన లావాదేవీలు ఏమైనా ఉన్నాయా.? లేదా బ్యాంక్‌కు వెళ్లే అవసరం ఉందా.? అయితే ఈ ముఖ్యమైన అలెర్ట్ మీకోసమే. సాధారణంగా బ్యాంకు లావాదేవీలు ఉన్న సమయంలో ఎవరైనా కూడా సెలవులు, లేదా పండుగలకు సంబంధించిన తేదీలను ముందే చూసుకుని.. తమ పనికి అడ్డం రాకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే జూన్ నెలలో మాత్రం మీరు క్యాలెండర్‌ను తిరగేయాల్సిన అవసరం లేదు. ఈ నెలలో ఎలాంటి ముఖ్యమైన పండుగలు లేవు. అంతేకాకుండా వీకెండ్స్‌లో వచ్చే సెలవులు తప్పించి.. బ్యాంకులు ఇతర తేదీల్లో తెరిచే ఉంటాయి. సో టెన్షన్ పడకుండా.. అసలు జూన్ నెల బ్యాంకుల సెలవుల లిస్టు ఏంటో చూసేద్దాం పదండి..

జూన్ నెలలో సాధారణ సెలవులు సంఖ్య 6. అందులో 4 ఆదివారాలు.. రెండో శనివారం, నాలుగో శనివారం ఉన్నాయి. దాదాపుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బ్యాంకులు ఈ 6 రోజులు మూసి ఉంటాయి. ఇక జూన్ 2వ తేదీన షిమ్లాలో మహారాణ ప్రతాప్ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అలాగే జూన్ 15న ఐజ్వాల్, భువనేశ్వర్, జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో వైఎంఏ డే, గురు హర్‌గోబింద్ పుట్టినరోజు, రాజ సంక్రాంతి సందర్భంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. కాగా, మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. వీకెండ్ హాలిడేస్ తప్పితే.. బ్యాంకులు ప్రతీ రోజూ పని చేస్తాయి.