Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయంటే..!

|

May 01, 2022 | 6:20 AM

Bank Holidays in May 2022: ప్రతి నెల బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వెల్లడిస్తుంది. ఈ సెలవులను బట్టి బ్యాంకు పనులను ..

Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయంటే..!
Banking News
Follow us on

Bank Holidays in May 2022: ప్రతి నెల బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వెల్లడిస్తుంది. ఈ సెలవులను బట్టి బ్యాంకు పనులను ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది రోజు వారీగా బ్యాంకు (Bank)లకు సంబంధించిన పనులు చేస్తుంటారు. లావాదేవీల విషయాలలో సమయం వృథా కాకుండా ముందస్తు సెలవులను గుర్తించుకుంటే బాగుంటుంది. అలాగే మే నెలలో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. వీటిని బట్టి మీరు బ్యాంకు పనుల నిమిత్తం ప్లాన్‌ చేసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం మే నెల నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రాష్ట్రాలు, అక్కడి జరుపుకునే పండుగలను బట్టి ఈ సెలవులు మారవచ్చు. ఈ జాబితా దేశవ్యాప్తంగా, రాష్ట్రాలలో జరుపుకొనే పండుగల ఆధారంగా రూపొందిస్తుంది ఆర్బీఐ. ఇక జాతీయ సెలవులు కాకుండా రాష్ట్రాల ప్రకారం కూడా కొన్ని సెలవులు ఉంటాయి. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. వినియోగదారులు బ్యాంకులకు వెళ్లే ముందు ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకోవడం మంచిది.

మేలో బ్యాంక్ సెలవులు

  1. మే1, 2022: కార్మిక దినోత్సవం/ మహారాష్ట్ర దినోత్సవం. దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు. అలాగే ఈ రోజు ఆదివారం కూడా.
  2. మే 2: మహర్షి పరశురామ జయంతి. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
  3. మే 3: ఈద్-ఉల్-ఫితర్, బసవ జయంతి (కర్ణాటక)
  4. మే 4: ఈద్-ఉల్-ఫితర్ (తెలంగాణ)
  5. మే 8: ఆదివారం (వారంతపు సెలవు)
  6. మే 9: గురు రవీంద్రనాథ్ జయంతి, త్రిపుర
  7. మే 14: 2వ శనివారం
  8. మే 15: ఆదివారం (వారంతపు సెలవు)
  9. మే16: బుధ్ పూర్ణిమ, బ్యాంకు సెలవు
  10. మే 24: ఖాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టినరోజు – సిక్కిం
  11. మే 28: 4వ శనివారం బ్యాంకు సెలవు
  12. మే 29: ఆదివారం (వారంతాపు సెలవు)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Gold Silver Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

Instagram: సరికొత్త ఫీచర్లతో అదరగొడుతోన్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఫీచర్లు చూస్తే వావ్‌ అనాల్సిందే..