Bank Holidays
పండుగల పరంగా మార్చి నెల చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో మహాశివరాత్రితో పాటు హోలీ పండుగ, మరోవైపు, గుడ్ ఫ్రైడే కూడా ఈ నెలలోనే వస్తుంది. అయితే పండగలు, వివిధ కార్యక్రమాల కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. మార్చి నెలలో దేశవ్యాప్తంగా 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. మరి ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం.
మార్చి నెలలో బ్యాంకులకు సెలవులు:
- మిజోరంలోని ఐజ్వాల్ నగరంలో మార్చి 1న చాప్చార్ కుత్ కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- మార్చి 3 ఆదివారం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- మార్చి 8న మహాశివరాత్రి కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
- మార్చి 9 రెండో శనివారం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.
- మార్చి 10 ఆదివారం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
- మార్చి 17 ఆదివారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
- మార్చి 22న బీహార్ డే సందర్భంగా బీహార్ అంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- మార్చి 23 నాలుగో శనివారం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు.
- మార్చి 24 ఆదివారం అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
- మార్చి 25న, హోలీ సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
- మార్చి 26న యయోసాంగ్ భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలోని బ్యాంకులకు సెలవు.
- మార్చి 27న హోలీ సందర్భంగా బీహార్‌లోని అన్ని నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్చి 29న దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- మార్చి 31 ఆదివారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి