Bank Holidays: జూలై నెలలో 12 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

|

Jun 24, 2024 | 2:26 PM

జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా జూలై నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీని ప్రకారం, దిగువన ఉన్న పూర్తి బ్యాంక్ సెలవుల జాబితాను తనిఖీ చేసిన తర్వాత, కస్టమర్‌లు తమ బ్యాంకింగ్ పనిని జూలైలో ఏ తేదీలలో పూర్తి చేయాలో ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల

Bank Holidays: జూలై నెలలో 12 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
Bank Holidays
Follow us on

జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా జూలై నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీని ప్రకారం, దిగువన ఉన్న పూర్తి బ్యాంక్ సెలవుల జాబితాను తనిఖీ చేసిన తర్వాత, కస్టమర్‌లు తమ బ్యాంకింగ్ పనిని జూలైలో ఏ తేదీలలో పూర్తి చేయాలో ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల చేస్తుంటుంది. పండుగలు, ప్రాంతీయ వేడుకలు, ప్రభుత్వ సెలవుల ఆధారంగా ఈ సెలవులను బ్యాంకులు నిర్ణయిస్తాయి. దీని ప్రకారం, దేశంలోని అన్ని బ్యాంకులు, శాఖలకు సాధారణ వారాంతపు సెలవులు వర్తిస్తాయి. దిగువ జాబితాలో పండుగలు, జాతీయ సెలవులు, రెండవ, నాల్గవ శనివారాలు వంటి వారాంతపు సెలవులతో పాటు అన్ని ఆదివారాలు ఉన్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండగల, ఇతర కార్యక్రమాలను బట్టి మూసి ఉంటాయని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Ratan Tata: అంబానీ-అదానీ వంటి ప్రపంచ సంపన్నుల జాబితాలో రతన్ టాటా ఎందుకు లేడు?

జూలైలో బ్యాంకుల సెలవుల జాబితా:

ఇవి కూడా చదవండి
  1. జూలై 3 – Behdienkhlam పండుగ సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
  2. జూలై 6 -MHIP డే సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు బంద్
  3. జూలై 7 – ఆదివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు
  4. జూలై 8 – కాంగ్ రథజాత్ర సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు
  5. జూలై 9 – ద్రుక్పా త్షే జీ సందర్భంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకులు మూసి ఉంటాయి
  6. జూలై 13 – రెండో శనివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు
  7. జూలై 14- ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  8. జూలై 16 -హరేలా సందర్భంగా డెహ్రాడూన్‌లోని బ్యాంకులు బంద్‌
  9. జూలై 17 – ముహర్రం సందర్భంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
  10. జూలై 21 – ఆదివారం దేశంలోని అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి
  11. జూలై 27 – నాల్గవ శనివారం దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు
  12. జూలై 28 – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

అయితే ఈ కాలాల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అంతరాయం లేకుండా పనిచేస్తాయి. కస్టమర్లు తమ ఆర్థిక సమస్యలను నిర్వహించడానికి మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన సేవలను ఎంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Indian Railways: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా? టికెట్‌ ఉన్నా జరిమానా చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి