
Bank Holidays In January 2026
Bank Holidays List in January 2026: 2026 సంవత్సరం ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 కోసం బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. 2026 కోసం RBI సెలవుల జాబితా ప్రకారం, జనవరిలో బ్యాంకులు 16 రోజుల పాటు మూసి ఉంటాయి. అయితే ఇవి వివిధ రాష్ట్రాలకు సంబంధించినవి. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు 4, ఆదివారాలు 6 సెలవులు ఉన్నాయి. అదనంగా 10 సెలవులు జాతీయ, రాష్ట్ర సెలవులు. అందువల్ల, జనవరి నెలలో ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత పని ఉంటే అలా చేయడానికి ముందు వారు తమ నగరానికి సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను తనిఖీ చేయాలని ఆర్బీఐ బ్యాంకులు వినియోగదారులకు సలహా ఇస్తున్నాయి.
జనవరి 2026లో బ్యాంకు సెలవులు:
జనవరి 2026లో నూతన సంవత్సరం, స్వామి వివేకానంద జయంతి, బిహు, మకర సంక్రాంతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, గణతంత్ర దినోత్సవం వంటి వివిధ సందర్భాలు, పండుగల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల శాఖలు చాలా రోజులు మూసి ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు వరుసగా రెండు నుండి మూడు రోజులు మూసి ఉంటాయి. అదనంగా రెండవ, నాల్గవ శనివారాలతో పాటు నాలుగు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు ఒకేసారి మూసి ఉంటాయి.
- జనవరి 1: ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, షిల్లాంగ్‌లలోని బ్యాంక్ బ్రాంచ్‌లు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా మూసి ఉంటాయి.
- జనవరి 2: నూతన సంవత్సర జయంతి సందర్భంగా ఐజ్వాల్, కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకు శాఖలు మూసివేయబడతాయి.
- జనవరి 3: జనవరి 3, 2026న, హజ్రత్ అలీ పుట్టినరోజు సందర్భంగా లక్నోలోని బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.
- జనవరి 4: ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలకు సెలవు.
- జనవరి 10: రెండవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల శాఖలు మూసి ఉంటాయి.
- జనవరి 11: ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.
- జనవరి 12: స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా కోల్‌కతాలోని బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.
- జనవరి 14: అహ్మదాబాద్, భువనేశ్వర్, గౌహతి, ఇటానగర్‌లలోని బ్యాంక్ శాఖలు మకర సంక్రాంతి/మాగ్ బిహు సందర్భంగా సెలవు ఉంటుంది.
- జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం/పొంగల్/మాఘే సంక్రాంతి/మకర సంక్రాంతి సందర్భంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,లలో బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.
- జనవరి 16: తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా చెన్నైలోని బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.
- జనవరి 17: ఉళవర్ తిరునాల్ సందర్భంగా చెన్నైలోని బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.
- జనవరి 18: ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలకు సెలవు.
- జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు/సరస్వతీ పూజ (శ్రీ పంచమి)/వీర్ సురేంద్రసాయి జయంతి/బసంత్ పంచమి సందర్భంగా అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలోని బ్యాంక్ శాఖలు మూసి ఉంటాయి.
- జనవరి 24: నాల్గవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల శాఖలు మూసి ఉంటాయి.
- జనవరి 25: ఆదివారం, దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలు మూసి వేస్తారు.
- జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, జమ్ము, కొచ్చి, కొహిమా, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాణాన్, పాట్నా, రాణ్‌పూర్, న్యూ పాట్నా, సిమ్లా, తిరువనంతపురం,విజయవాడలోని బ్యాంకులకు సెలవు.
ఇది కూడా చదవండి: RBI: ఇక 10 రూపాయల నోట్లు కనిపించవా..? ఆర్బీఐ అసలు ప్లాన్ ఇదే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి