Bank Holidays in December: బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్.. డిసెంబర్‌లో 12 రోజుల సెలవులు..

|

Nov 30, 2021 | 11:29 AM

December 2021 Bank Holidays: బ్యాంకుల్లో ఏమైనా పనులుంటే.. ముందే ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే.. సంవత్సరంలో చివరి నెల డిసెంబర్‌‌లో

Bank Holidays in December: బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్.. డిసెంబర్‌లో 12 రోజుల సెలవులు..
Sbi
Follow us on

December 2021 Bank Holidays: బ్యాంకుల్లో ఏమైనా పనులుంటే.. ముందే ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే.. సంవత్సరంలో చివరి నెల డిసెంబర్‌‌లో ఎక్కువ రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ తేదీల ప్రకారం ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటే మేలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్‌ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు పని చేయనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 2021 సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పంచుకున్న సెలవుల జాబితా ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు డిసెంబర్‌లో 12 రోజులపాటు సెలవులు ఉండనున్నాయి.

క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, ఆదివారాలు, రెండు, నాల్గవ శనివారాలు కాకుండా మొత్తం ఏడు సెలవులు ఉన్నాయి. అయితే.. బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాల ప్రకారం సెలవులు ఉండనున్నాయన్న సంగతిని కస్టమర్లు గమనించాల్సి ఉంటుంది.

డిసెంబర్‌లో బ్యాంక్ సెలవుల జాబితా:
డిసెంబరు 3: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా గోవాలో బ్యాంకులు మూసివేయబడతాయి
డిసెంబర్ 5: ఆదివారం
డిసెంబర్ 11: రెండవ శనివారం
డిసెంబర్ 12: ఆదివారం
డిసెంబర్ 18: యు సో సో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో మాత్రమే బ్యాంకులు మూసివేయబడతాయి.
డిసెంబర్ 19: ఆదివారం
డిసెంబర్ 24: క్రిస్మస్ ఈవ్
డిసెంబర్ 25: క్రిస్మస్/నాల్గవ శనివారం
డిసెంబర్ 26: ఆదివారం
డిసెంబర్ 27: క్రిస్మస్ వేడుక (ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి)
డిసెంబర్ 30: షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి
డిసెంబర్ 31: కొత్త సంవత్సరం సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి

కావున.. బ్యాంకుల వినియోగదారులు ఈ సెలవుల ప్రకారం లావాదేవీలను ముందే ప్రణాళిక ప్రకారం నిర్వహించుకుంటే మంచిదని బ్యాంకింగ్ అధికారులు సూచిస్తున్నారు. అయితే.. కొన్ని ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లోని వేడుకలు, పండుగల సందర్భంగా బ్యాంకులను మూసివేస్తారు. ఇలాంటి సందర్భాల్లో మరికొన్ని ప్రాంతాల్లో బ్యాంకుల లావాదేవీలు యథావిధిగా జరుగుతాయి.

Also Read:

Personal Loans: కస్టమర్లకు సులభంగా బ్యాంకు రుణాలు.. ఐదు రకాల పర్సనల్ లోన్లు ఉన్నాయని మీకు తెలుసా..?

Crime News: చపాతీలు చేయనన్నందుకు యువకుడి హత్య.. దారుణంగా గొంతుకోసి..