AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..

Bank Holidays: బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. UPI (GPay, PhonePe) ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ యథావిధిగా పనిచేస్తాయి. నగదు ఉపసంహరణ కోసం..

Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..
Bank Holidays in May 2026: మే నెలలో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక సమాచారం అందించింది. పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా వచ్చే నెలలో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఈ సెలవుల జాబితాను గమనించకుండా ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు తప్పవు.
Subhash Goud
|

Updated on: Apr 03, 2026 | 10:51 AM

Share

April Bank Holidays: ఏప్రిల్‌లో బ్యాంకింగ్ సంబంధిత పనులలో నిమగ్నమయ్యే ముందు, సెలవులను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఈ నెలలో బ్యాంకులు మొత్తం 14 రోజులు మూసి ఉండనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నెల ప్రారంభమైంది. సాధారణ కస్టమర్ సేవ పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులు ఈ రోజున తమ ఆర్థిక పనులను పూర్తి చేస్తాయి.

సెలవుల విషయానికి వస్తే వివిధ రాష్ట్రాల్లో పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా నెల మొత్తం మీద సుమారు ఎనిమిది రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. దీనికి అదనంగా నాలుగు ఆదివారాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుంది. అలాగే, రెండవ, నాల్గవ శనివారాల్లో కూడా బ్యాంకులు మూసి ఉంటాయి.

ఇది కూడా చదవండి: Air Cooler: ఏసీని సైతం తలదన్నే ఎయిర్ కూలర్‌.. అతి తక్కువ ధరల్లోనే ఏసీ లాంటి కూలింగ్‌!

ఇవి కూడా చదవండి

➦ ఏప్రిల్ 1 (బుధవారం): ఆర్థిక సంవత్సర ముగింపు కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని బ్యాంకులూ మూతపడతాయి.

➦ ఏప్రిల్ 2 (గురువారం): మౌండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో సెలవు.

➦ ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.

➦ ఏప్రిల్‌ 5 (ఆదివారం): సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు బంద్‌

➦ ఏప్రిల్ 11న (శనివారం): రెండో శనివారం సందర్బంగా బ్యాంకులకు సెలవు

➦ ఏప్రిల్‌ 12 (ఆదివారం): బ్యాంకులు బంద్‌

➦ ఏప్రిల్ 14 (మంగళవారం): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ వంటి పండుగల సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో సెలవు.

➦ ఏప్రిల్ 15 (బుధవారం): బెంగాలీ నూతన సంవత్సరం, హిమాచల్ దివస్ సందర్భంగా కోల్‌కతా, అగర్తల, గువహటి, షిమ్లా, కొచ్చి వంటి నగరాల్లో సెలవు.

➦ ఏప్రిల్ 16 (గురువారం): బొహాగ్ బిహు సందర్భంగా గువహటిలో బ్యాంకులు మూతపడతాయి.

➦ ఏప్రిల్ 19 (ఆదివారం ) సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు బంద్‌

➦ ఏప్రిల్ 20 (సోమవారం): బసవ జయంతి / అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరుతో సహా పలు రాష్ట్రాల్లో సెలవు.

➦ ఏప్రిల్ 21 (మంగళవారం): గారియా పూజ సందర్భంగా అగర్తలలో సెలవు.

➦ ఏప్రిల్ 25 (శనివారం) నాలుగో శనివారం

➦ ఏప్రిల్‌ 26 (ఆదివారం): దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. UPI (GPay, PhonePe) ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ యథావిధిగా పనిచేస్తాయి. నగదు ఉపసంహరణ కోసం ATM సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. బ్యాంకుకు వెళ్లే పని ఉంటే, పైన పేర్కొన్న సెలవులను దృష్టిలో ఉంచుకుని మీ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోండి.

ఇది కూడా చదవండి: Summer Business Ideas: సమ్మర్‌లో సూపర్ బిజినెస్‌.. ఈ చిన్న చిట్కాలతో డబ్బే.. డబ్బు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us