ప్రతి రోజు బ్యాంకుల పనిమిత్తం వెళ్లే వారు చాలా మంది ఉంటారు. బ్యాంకు లావాదేవీలు చేసే వారి ప్రతి రోజు చాలా మంది ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. డిజిటల్ లావాదేవీల యుగంలోనూ వివిధ బ్యాంకుల ఖాతాదారులు ఆఫ్ లైన్ సేవలు పొందాలంటే తమ ఖాతా ఉన్న బ్యాంకు శాఖకు వెళ్లాల్సిందే. గతంలో గతంలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించాలన్నా బ్యాంకులకు తప్పకుండా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందడంతో ఇంట్లోనే ఉండి స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాంకింగ్ సేవలు పొందుతున్నారు. అయితే ప్రతినెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది.
ఈ నేపథ్యంలో ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లి వివిధ లావాదేవీల పనులను చేసుకునేందుకు ముందస్తు ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సమయం వృధా కాకుండా చేసుకోవచ్చు. ప్రతి నెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది. మరి ఫిబ్రవరిలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు వచ్చాయో తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి.
☛ ఫిబ్రవరి 5 – ఆదివారం (అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు)
☛ ఫిబ్రవరి 11 – రెండో శనివారం ( అన్ని ప్రాంతాల్లో)
☛ ఫిబ్రవరి 12 – ఆదివారం (అన్ని ప్రాంతాల్లో సెలవు)
☛ బుధవారం15 – మణిపూర్‌లో లూయి నగాయినీ వేడుక.
☛ ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి – (కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి)
☛ ఫిబ్రవరి 19 -ఆదివారం, ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి
☛ ఫిబ్రవరి 20 రాష్ట్ర దినోత్సవం (అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో సెలవు)
☛ ఫిబ్రవరి 21- లూసార్ (సిక్కింలో బ్యాంకులు బంద్)
☛ ఫిబ్రవరి 25 – నాలుగో శనివారం (అన్ని ప్రాంతాల్లో సెలవు)
☛ ఫిబ్రవరి 26 – ఆదివారం (అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.)
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి