Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. డిసెంబర్‌ నెలలో బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..

|

Nov 25, 2022 | 1:47 PM

ప్రతి నెల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకుల సెలవులను ప్రకటిస్తుంటుంది. బ్యాంకు లావాదేవీలు జరిపే వినియోగదారులు ముందస్తుగా సెలవులను..

Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. డిసెంబర్‌ నెలలో బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..
Bank Holidays
Follow us on

ప్రతి నెల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకుల సెలవులను ప్రకటిస్తుంటుంది. బ్యాంకు లావాదేవీలు జరిపే వినియోగదారులు ముందస్తుగా సెలవులను గమనించి ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు సెలవులను గమనించి ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం ద్వారా మీ సమయం వృధా కాకుండా ఉంటుంది. వచ్చే నెల డిసెంబర్‌లో 13 రోజలు పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. బ్యాంకులు మూసి ఉన్నా ఆన్‌లైన్‌ సర్వీసు కొనసాగుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చేసే పని సులభంగా చేయవచ్చు. 4 ఆదివారాలు కాకుండా, డిసెంబర్‌లో వచ్చే సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంకు ప్రతి నెల బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల చేస్తుంటుంది.

డిసెంబర్‌లో బ్యాంకులకు సెలవులు:

  1. డిసెంబర్ 3 – శనివారం – సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ – గోవాలో బ్యాంకు మూసివేత
  2. డిసెంబర్ 4 – ఆదివారం
  3. డిసెంబర్ 10 – రెండో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు  మూసి ఉంటాలి
  4. డిసెంబర్ 11 – ఆదివారం
  5. ఇవి కూడా చదవండి
  6. డిసెంబర్ 12 – సోమవారం – పా-టాగన్ నెంగ్మింజ సంగం – మేఘాలయలో సెలవు
  7. డిసెంబర్ 18 – ఆదివారం
  8. డిసెంబర్ 19 – సోమవారం – గోవా విమోచన దినం – గోవాలో బ్యాంకు మూసి ఉంటుంది
  9. డిసెంబర్ 24 – శనివారం – క్రిస్మస్, నాల్గవ శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి
  10. డిసెంబర్ 25 – ఆదివారం
  11. డిసెంబర్ 26 – సోమవారం – క్రిస్మస్, లాసంగ్, నమ్సంగ్ – మిజోరం, సిక్కిం, మేఘాలయలో సెలవు
  12. డిసెంబర్ 29 – గురువారం – గురు గోవింద్ సింగ్ జి పుట్టినరోజు – చండీగఢ్‌లో బ్యాంక్ మూసి ఉంటుంది
  13. డిసెంబర్ 30 – శుక్రవారం – యు కియాంగ్ నంగ్వా – మేఘాలయలో సెలవు
  14. డిసెంబర్ 31 – శనివారం – నూతన సంవత్సర వేడుకలు – మిజోరంలో సెలవు

ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయా?

బ్యాంకు వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సెలవులన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర విషయాల ఆధారంగా సెలవులు ఉంటాయి.  జాతీయ స్థాయిలో డిసెంబర్‌లో 3,4,10,11,18,24,25 తేదీల్లో బ్యాంకులు ఏకకాలంలో మూసి ఉంటాయి. డిసెంబర్ 24న, క్రిస్మస్, నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఇలా బ్యాంకులు కొన్ని రాష్ట్రాల్లో మూసి ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..