Bank Holidays: వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. ఎందుకో తెలుసా..?

Bank Holidays: బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో మొబైల్, ఇంటర్‌నెట్‌ బ్యాంక్‌, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. దాంతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేందుకు వీలుంటుంది. నగదు విత్‌డ్రా కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్‌ డిపాజిట్‌ కోసం..

Bank Holidays: వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. ఎందుకో తెలుసా..?

Updated on: Apr 09, 2025 | 1:24 PM

చాలా మంది ప్రతి రోజు వివిధ రకాల లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినెల బ్యాంకులకు సెలవులను ప్రకటిస్తుంటుంది. ఆ సెలవు దినాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. బ్యాంకు వినియోగదారులు ముందుస్తుగా బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో గమనించి ప్లాన్‌ చేసుకోవడం చాలా ముఖ్యం.

అయితే ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుందని గుర్తించుకోండి. అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండకపోవచ్చు.

ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బ్యాంకులకు వరుస సెలవులు ఉండే అవకాశం ఉంది. 10వ తేదీన మహవీర్‌ జయంతి, 11న మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి, 12న శనివారం, 13న ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి. ఈ రోజులలో బ్యాంకులు మూసి ఉండే అవకాశం ఉంది. 11న ఏపీ, తెలంగాణలో బ్యాంకులకు సెలవు లేదు. తెరిచే ఉంటాయి. మిగతా రాష్ట్రాల్లో సెలవు ఉంది.

అయితే బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో మొబైల్, ఇంటర్‌నెట్‌ బ్యాంక్‌, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. దాంతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేందుకు వీలుంటుంది. నగదు విత్‌డ్రా కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్‌ డిపాజిట్‌ కోసం మెషిన్స్‌ సైతం అందుబాటులో ఉండగా.. వీటితో అకౌంట్‌లో డబ్బులు చేసుకునే అవకాశం ఉంది.

ఏప్రిల్ 15 – బెంగాలీ న్యూ ఇయర్‌ సందర్భంగా అసోం, వెస్ట్‌ బెంగాల్‌ సహా పలు బ్యాంకులకు హాలీడే.
ఏప్రిల్ 18 – గుడ్‌ఫ్రై డే సందర్భంగా పలు ప్రాంతాల్లో బ్యాంకుల మూసివేత.
ఏప్రిల్‌ 20 – ఆదివారం సందర్భంగా బ్యాంకులు బంద్‌.
ఏప్రిల్ 21 – గరియా పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్‌ 26 – శనివారం సందర్భంగా సెలవు.
ఏప్రిల్‌ 27 -ఆదివారం సందర్భంగా సెలవు.
ఏప్రిల్ 29 – భగవాన్ పరశురామ్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకుల మూసివేత.
ఏప్రిల్ 30 – బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు బంద్‌.