Bank Holidays: సమ్మె ఎఫెక్ట్ కారణంగా దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు మూత పడనున్నాయి. ఫలితంగా బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం కలుగనుంది. వివరాల్లోకెళితే.. మార్చి 28, 29 తేదీలలో బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. దాంతో పలు బ్యాంకులలో పని చేసే యూనియన్ మెంబర్స్ ఈ సమ్మెలో పాల్గొననున్నారు. ఫలితంగా పలు బ్యాంకుల సేవలకు అంతరాయం కలుగనుంది. బ్యాంక్ యూనియన్లు ఇచ్చిన సమ్మె పిలుపు కారణంగా.. RBL శాఖలు కూడా ప్రభావితం అవుతాయని RBL ప్రధాన కార్యాలయం ప్రకటించింది.
“ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ప్రాతినిధ్యం వహిస్తున్న వర్క్‌మెన్ యూనియన్‌లు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) సమ్మె నోటీసును అందజేశాయి. అందులో పేర్కొన్న డిమాండ్ల కోసం ఉద్యోగులు మార్చి 28, 29 తేదీలలో సమ్మె చేయాలని ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రభావం బ్యాంకు సర్వీసులపై పడనుంది.’’ అని ఆర్‌బిఎల్ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘రత్నాకర్ బ్యాంక్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్, రత్నాకర్ బ్యాంక్ ఎంప్లాయి యూనియన్.. AIBOA, AIBEA లో అనుబంధంగా ఉన్నాయి. ఈ యూనియన్లతో సంబంధం ఉన్న బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు.’’ అని ఆర్‌బిఎల్ పేర్కొంది. ఈ సమ్మె నేపథ్యంలో బ్యాంకు సేవల విషయంలో కస్టమర్లకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకోవాలని కస్టమర్లకు ఆర్‌బిఎల్ విజ్ఞప్తి చేసింది.
Also read:
Viral Video: చిన్నోడు ఏం చేస్తాడులే అని అనుకున్నారు.. క్షణాల వ్యవధిలోనే గట్టిగా ఇచ్చిపడేశాడు..!
Summer Health Tips: జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా? అయితే, ఇలా చేయండి..!