Bajaj pulsar NS400Z: సరికొత్త అప్ డేట్లతో విడుదలైన పల్సర్.. బైక్ ప్రియులకు పండగే..!

మన దేశంలో ద్విచక్ర వాహనాల వినియోగం బాగా ఎక్కువ. అన్ని తరగతుల ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా వీటిని వాడుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే మోటార్ సైకిల్ నేడు ప్రజలకు కనీస అవసరంగా మారింది. ఆ డిమాండ్ కు తగినట్టుగా అనేక కంపెనీలు తమ మోటారు సైకిళ్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అలాంటి వాటిలో బజాజ్ ఆటో ఒకటి. ఈ కంపెనీ నుంచి విడుదలైన వాహనాలకు సాధారణంగానే డిమాండ్ ఎక్కువ. దీనికి తోడు యువతను ఆకట్టుకునేలా బైక్ లు తయారు చేయడంలో వీరు సిద్ధహస్తులు. ఈ నేపథ్యంలో కొత్తగా పల్సర్ ఎన్ఎస్400 జెడ్ బైక్ ను ఇటీవల మార్కెట్ లోకి విడుదల చేశారు. దాని ప్రత్యేకతలు, ధర, ఇతర వివరాలు తెలుసుకుందాం.

Bajaj pulsar NS400Z: సరికొత్త అప్ డేట్లతో విడుదలైన పల్సర్.. బైక్ ప్రియులకు పండగే..!
Bajaj Pulsar Ns400z

Updated on: Jul 09, 2025 | 4:50 PM

బజాజ్ పల్సర్ 2025 ఎన్ఎస్400జెడ్ బైక్ మంచి స్లైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది. దీని ధరను రూ.1.92 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ధారించారు. డిజైన్ విషయంలో పెద్దగా అప్ డేట్ లేనప్పటికీ, ఇంజిన్ విషయంలో మెరుగుదల చేశారు. అలాగే కొత్త ఫీచర్లు జోడించారు. ఖాతాదారులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ బైక్ లో మార్పులు చేసినట్టు కంపెనీ తెలిపింది.

కొత్త పల్సర్ లో 373 సీసీ ఇంజిన్ ను అలాగే ఉంచారు. కానీ వాల్వ్ ట్రెయిన్ ను కొత్త కామ్ టైమింగ్ లు, ఇన్ టేక్ డక్ట్ తో సవరించారు. పిస్టన్ ఫోర్ట్ చేయడం ద్వారా ఘర్షణను తగ్గించడం, మన్నికను పెంచడానికి వీలు కలిగింది. ముఖ్యంగా పవర్ అవుట్ పుట్ ను 40 పీఎస్ నుంచి 43 పీఎస్ వరకూ పెరిగింది. రైడర్ కాళ్లకు వేడి తగలకుండా ఉండేందుకు రేడియోటర్ కౌల్ ను ఏర్పాటు చేశారు.

పల్సర్ ఎన్ఎస్400 జెడ్ గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్ల నుంచి 157 కిలోమీటర్లకు పెరిగింది. అలాగే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగం చేసుకునే సమయంలో 7.5 సెకన్ల నుంచి 6.4 సెకన్లకు తగ్గింది. సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 2.7 సెకన్లు పడుతుంది. గతంలో దీని కోసం 3.2 సెకన్లు పట్టేది. ఇలా ఇంజిన్ విభాగంలో మెరుగైన మార్పులతో కొత్త బండిని తీసుకువచ్చారు. కొత్తగా చేసిన మార్పుల వల్ల వినియోగదారులకు అదనపు ఇంధన భారం పడదని కంపెనీ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

కొత్త పల్సర్ లో ఇతర అప్ డేట్ల విషయానికి వస్తే టైర్లను మార్పు చేశారు. ముందు, వెనుక భాగంలో రేడియల్ టైర్లను ఏర్పాటు చేశారు. అపోలో ఆల్పా హెచ్1 టైర్లను కొత్త బండిని బిగించారు. ఇవి మంచి గ్రిప్ ఇస్తాయి. దీని వల్ల ఎలాంటి రోడ్డుపై నైనా బైక్ చక్కగా పరుగులు తీస్తుంది. అలాగే రోడ్డుపై జారి పోకుండా గట్టిగా పట్టుకుంటుంది. దీంతో రైడర్ వాహనాన్ని చాలా సులువుగా నియంత్రణ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి