Pulsar N160: పల్సర్‌ నుంచి మార్కెట్లోకి కొత్త బైక్‌.. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు..

|

Jun 16, 2024 | 7:49 AM

ఈ క్రమంలోనే తాజాగా పల్సర్‌లో కొత్త వేరియంట్‌ను లాంచ్‌ చేశారు. పల్సర్‌ ఎన్‌160 పేరుతో కొత్త బైక్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ కొత్త వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అధునాతన ఫీచర్లకు ఈ బైక్‌లో పెద్ద పీట వేశారు. నిజానికి ఈ బైక్‌ స్టాండర్డ్‌ బజాజ్‌ పల్సర్‌ ఎన్‌160 మాదిరిగానే అనిపించినప్పటికీ..

Pulsar N160: పల్సర్‌ నుంచి మార్కెట్లోకి కొత్త బైక్‌.. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు..
Pulsar N160
Follow us on

ప్రముఖ వాహనాల సంస్థ బజాజ్‌కు భారత్‌లో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఈ కంపెనీ నుంచి వచ్చిన టూ వీలర్స్‌కు భలే గిరాకీ ఉంటుంది. పల్సర్‌ బైక్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్‌ అలాంటిది. ఎన్నో ఏళ్ల నుంచి పల్సర్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక యువత అవసరాలకు అనుగుణంగా పల్సర్‌లో సరికొత్త ఫీచర్లను అందిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా పల్సర్‌లో కొత్త వేరియంట్‌ను లాంచ్‌ చేశారు. పల్సర్‌ ఎన్‌160 పేరుతో కొత్త బైక్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ కొత్త వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అధునాతన ఫీచర్లకు ఈ బైక్‌లో పెద్ద పీట వేశారు. నిజానికి ఈ బైక్‌ స్టాండర్డ్‌ బజాజ్‌ పల్సర్‌ ఎన్‌160 మాదిరిగానే అనిపించినప్పటికీ.. ఇందులో కొన్ని స్మార్ట్‌ ఫీచర్లను అందించారు. ప్రస్తుతం ఉన్న ఫీచర్లకు తోడుగా అదనపు ఫీచర్లను అందించారు.

టర్న్‌-బై-టర్న్‌ నేవిగేషన్‌ను బ్లూటూత్‌ ఆధారిత ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ ద్వారా తీసుకొచ్చింది. శాంపేన్‌ గోల్డ్‌ 33 ఎమ్‌ఎమ్‌ యూఎస్‌డీ ఫోర్క్స్‌ను ఇందులో జోడించారు. ఇక ఏబీఎస్‌ రైడ్‌హ ఓడ్‌ను ఇందులో ప్రత్యేకంగా అందించారు. అప్‌సైడ్‌ డౌన్‌ ఫోర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబీఎస్‌ మోడ్‌ వంటి అధునాతన ఫీచర్లు ఈ బైక్‌ సొంతం.

ఇక ఇంజన్‌ విషయానికొస్తే ఈ బైక్‌లో 164.82 సీసీ ఇంజ్‌ను అందించారు. ఇది 8750 rpm వద్ద 16 హార్స్ పవర్, 6750 rpm వద్ద 14.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇంజిన్‌లో ఎటువంటి అప్డేట్ లేదు, కాబట్టి అదే పనితీరును అందిస్తుంది. ధర విషయానికొస్తే ఈ బైక్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.1,39,693గా నిర్ణయించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..