Bajaj Finance: బజాజ్‌ ఫైనాన్స్‌ డిపాజిట్‌ దారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన కంపెనీ..

|

Jun 14, 2022 | 7:15 AM

బజాజ్ ఫిన్‌సర్వ్ రుణ విభాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.20 శాతం వరకు పెంచింది. 24 నెలల నుంచి 60 నెలల వరకు FDలు ఉంటాయి...

Bajaj Finance: బజాజ్‌ ఫైనాన్స్‌ డిపాజిట్‌ దారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన కంపెనీ..
Follow us on

బజాజ్ ఫిన్‌సర్వ్ రుణ విభాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.20 శాతం వరకు పెంచింది. 24 నెలల నుంచి 60 నెలల వరకు FDలు ఉంటాయి. అయితే 44 నెలల FD లు ఇందులో చేర్చలేదు. 0.20 శాతం వరకు పెరిగే బజాజ్ ఫైనాన్స్ FDలపై సవరించిన రేట్లు జూన్ 14, 2022 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా డిపాజిట్లు, మెచ్యూర్ డిపాజిట్ల పునరుద్ధరణపై ఈ రేట్లు వర్తిస్తాయి. కొత్త రేట్ల ప్రకారం డిపాజిటర్లు 36 నెలల నుంచి 60 నెలల వరకు ఉన్న FDలపై 7.20 శాతం వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25% వడ్డీ ఇస్తారు. 44 నెలల కాలానికి వడ్డీ రేటు 7.35 శాతంగా ఉంటుందని పత్రికా ప్రకటన తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచాలని నిర్ణయించిన తర్వాత చాలా ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ కాలాల కోసం రుణ వడ్డీ రేటును పెంచాయి.

దీంతో పాటు పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటును పెంచాలని నిర్ణయించారు. సింగపూర్‌కు చెందిన డిబిఎస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 10 నుండి 50 బేసిస్ పాయింట్లు పెంచింది. 2 కోట్ల కంటే తక్కువ FDలపై ఈ పెంపు జరిగింది. సీనియర్ సిటిజన్లు వడ్డీ రేటులో 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. జూన్ 10 నుంచి కొత్త వడ్డీ రేటును ప్రకటించింది. అదే సమయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కనీస వడ్డీ రేటు 2.75 శాతం, గరిష్ట వడ్డీ రేటు 5.60 శాతం. రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కనీస వడ్డీ రేటు 3 శాతానికి, గరిష్ట వడ్డీ రేటు 4.30 శాతానికి పెరిగింది. ఇది కాకుండా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ మరియు ఆర్‌బిఎల్ బ్యాంక్‌లతో సహా అనేక ఆర్థిక సంస్థలు పొదుపు మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచాయి.