Ayushman Card: మొబైల్ నంబర్ ఉపయోగించి మీ PMJAY కార్డ్ డౌన్‌లోడ్‌ చేయడం ఎలా?

Ayushman Card Download: మీ ఆయుష్మాన్ కార్డును సజావుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీ ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్, e-KYC కోసం ఆధార్ నంబర్, మీ కుటుంబ ID లేదా PMJAY ID అందుబాటులో ఉండాలి. కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి సాధారణంగా ఎటువంటి ఛార్జీలు ఉండవు..

Ayushman Card: మొబైల్ నంబర్ ఉపయోగించి మీ PMJAY కార్డ్ డౌన్‌లోడ్‌ చేయడం ఎలా?

Updated on: Nov 28, 2025 | 10:11 AM

Ayushman Card Download: ఆయుష్మాన్ భారత్ PMJAY అనేది భారతదేశపు ప్రధాన ప్రజారోగ్య బీమా పథకం. ఇది ద్వితీయ, తృతీయ స్థాయి సంరక్షణ కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందిస్తుంది. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన -PMJAY (ఆయుష్మాన్ భారత్) కార్డ్ అర్హతకు రుజువుగా ఉపయోగించబడుతుంది. ఇది లబ్ధిదారులు ప్రభుత్వం ఆమోదించిన ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో చికిత్స పొందేందుకు ఉపయోగపడుతుంది. అందుకే కార్డు డౌన్‌లోడ్ చేసుకుని పీడీఎఫ్‌ వెర్షన్‌ను ప్రింట్‌ తీసుకుని ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ కింది అధికారిక ఛానెల్‌లలో దేనినైనా ఉపయోగించి మీ ఆయుష్మాన్ భారత్ / PMJAY కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. beneficiary.nha.gov.in (లేదా pmjay.gov.in) ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే అధికారిక ఆయుష్మాన్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇక డిజిలాకర్ ప్లాట్‌ఫామ్ (మీ PMJAY కార్డ్ జారీ చేసిన కింద లింక్ చేసి ఉంటే ఎకూడా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుంటుంది.

మొబైల్ నంబర్ ద్వారా ఆయుష్మాన్ కార్డ్‌ డౌన్‌లోడ్:

మీ ఆయుష్మాన్ కార్డును సజావుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీ ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్, e-KYC కోసం ఆధార్ నంబర్, మీ కుటుంబ ID లేదా PMJAY ID అందుబాటులో ఉండాలి. కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి సాధారణంగా ఎటువంటి ఛార్జీలు ఉండవు. కార్డ్ జనరేషన్ ఉచితం. ఆయుష్మాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ దశలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Financial Deadlines: సమయం లేదు మిత్రమా.. ఈనెల 30 లోపు ఈ 4 ముఖ్యమైన పనులను పూర్తి చేయండి.. లేకుంటే ఇబ్బందులే..

NHA లబ్ధిదారుల పోర్టల్ (beneficiary.nha.gov.in) లేదా ఆయుష్మాన్ యాప్‌లో లాగిన్‌ అయి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే అందులో మీ రాష్ట్రం, జిల్లా, పథకం (PMJAY)ని ఎంచుకోవాలి. మొబైల్ నంబర్, ఆధార్, కుటుంబ ID లేదా PMJAY ID ఇచ్చిన సెర్చ్‌పై క్లిక్‌ చేయండి. తర్వాత మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి. అక్కడ మీ కుటుంబం/సభ్యుల వివరాలు కనిపిస్తాయి. సంబంధిత కుటుంబ సభ్యుడిని ఎంచుకుని, “డౌన్‌లోడ్ కార్డ్” పై క్లిక్ చేయండి. PMJAY ID, QR కోడ్ ఉన్న కార్డ్ PDF డౌన్‌లోడ్ అవుతుంది. ఇవి కాకుండా మీ సమీపంలో ఉన్న కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (CSC) లేదా ఆస్పత్రిలోని ఆయూష్మాన్‌ మిత్ర డెస్క్‌కు వెళ్లి కూడా కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: 2026 Holidays List: ఉద్యోగులు, విద్యార్థుల గుడ్‌న్యూస్‌.. వచ్చే ఏడాది భారీగా సెలవులు.. జాబితా విడుదల

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి