Paytm IPO: స్టాక్ ‎మార్కెట్‎లో లిస్టైయిన పేటీఎం.. మొదటి రోజే మదుపరులకు షాక్..

|

Nov 18, 2021 | 12:40 PM

Paytm IPO: ఈ రోజు పేటీఎం షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. NSE, BSE రెండింటిలో లిస్టయ్యాయి. కానీ ఇష్యూ ధర కంటే 9.3 శాతం తక్కువతో లిస్టయ్యాయి. ఆ తర్వాత కూడా పేటీఎం షేర్లు భారీగా పడిపోయాయి....

Paytm IPO: స్టాక్ ‎మార్కెట్‎లో లిస్టైయిన పేటీఎం.. మొదటి రోజే మదుపరులకు షాక్..
Paytm
Follow us on

Paytm IPO: ఈ రోజు పేటీఎం షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. NSE, BSE రెండింటిలో లిస్టయ్యాయి. కానీ ఇష్యూ ధర కంటే 9.3 శాతం తక్కువతో లిస్టయ్యాయి. ఆ తర్వాత కూడా పేటీఎం షేర్లు భారీగా పడిపోయాయి. పేటీఎం షేరు ఇష్యూ ధరను రూ.2,150గా నిర్ణయించగా ఈరోజు NSEలో రూ. 1,950, BSEలో రూ. 1,955 వద్ద లిస్ట్ అయ్యాయి. ఆ తర్వాత పేటీఎం షేర్లు మరింత తగ్గి 23 శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి.

రూ.18,300కోట్ల సమీకరణే లక్ష్యంగా పేటీఎం నిర్వహించిన ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు మోస్తరు స్పందన వచ్చిందని నిపుణులు చెబుతన్నారు. ఈ ఐపీఓకు 1.89 రెట్లు అధికంగా బిడ్డింగ్‌లు వచ్చాయి. కేవలం భారత్‌లోనే కాదు.. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇదే అతిపెద్ద ఐపీఓ. దీని కంటే ముందు మన దేశంలో 2010లో కోల్‌ ఇండియా తీసుకొచ్చిన రూ.15,200 కోట్ల ఐపీఓనే ఇప్పటి వరకు అతిపెద్దదిగా నిలిచింది.

నిపుణులు ఏమంటారు?

సబ్‌స్క్రిప్షన్ గణాంకాలు తక్కువ ఉందని అందుకే షేరు విలువ తగ్గుతుందని చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వారు ఫ్లాట్ లిస్టింగ్‌ను ఆశించారు. ఇది బలహీనమైన లిస్టింగ్‌ను భావిస్తున్నట్లు చెప్పారు. ఇష్యూ ధర కంటే దిగువన ట్రేడవుతున్న ఈ షేరు రానున్న రోజుల్లో అలాగే నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

వన్‌97కమ్యూనికేషన్స్‌ను 2000లో ప్రారంభించారు. తొలుత మొబైల్‌ టాప్‌-అప్‌లు, బిల్లు చెల్లింపుల సేవల్ని అందించేది. 2009లో డిజిటల్‌ చెల్లింపుల నిమిత్తం ప్రారంభించిన పేటీఎం మొబైల్‌ యాప్‌తో కంపెనీ రూపురేఖలే మారిపోయాయి. అనతికాలంలో దేశంలో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులకు ప్రధాన డిజిటల్‌ మాధ్యమంగా మారింది.

Read Also.. IndiGo: విమాన టికెట్ ధరలు తగ్గే అవకాశం..! అది లగేజీ లేకుంటేనే..